మద్యం మత్తులో రైలు పట్టాలపైకి లారీ నడిపిన డ్రైవర్‌.. తర్వాత ??

|

Nov 28, 2023 | 10:08 AM

పంజాబ్‌లోని లూథియానాలో మద్యం మత్తులో ఓ డ్రైవర్‌ లారీని రైలు పట్టాలపై నడిపాడు. ఆ లారీ రైలు పట్టాల వద్ద చిక్కుకుపోవడంతో అక్కడి నుంచి పారిపోయాడు. ఇంతలో మరో ట్రాక్‌పై వస్తున్న ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌ లోకో పైలట్‌ పట్టాలపై లారీ ఉండటాన్ని గమనించాడు. వెంటనే ఎమర్జెన్సీ బ్రేకులు వేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. శుక్రవారం రాత్రి మద్యం మత్తులో ఉన్న లారీ డ్రైవర్‌ షేర్పూర్ ఫ్లైఓవర్ సమీపంలోని రైల్వే ట్రాక్‌ పైకి లారీని నడిపాడు.

పంజాబ్‌లోని లూథియానాలో మద్యం మత్తులో ఓ డ్రైవర్‌ లారీని రైలు పట్టాలపై నడిపాడు. ఆ లారీ రైలు పట్టాల వద్ద చిక్కుకుపోవడంతో అక్కడి నుంచి పారిపోయాడు. ఇంతలో మరో ట్రాక్‌పై వస్తున్న ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌ లోకో పైలట్‌ పట్టాలపై లారీ ఉండటాన్ని గమనించాడు. వెంటనే ఎమర్జెన్సీ బ్రేకులు వేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. శుక్రవారం రాత్రి మద్యం మత్తులో ఉన్న లారీ డ్రైవర్‌ షేర్పూర్ ఫ్లైఓవర్ సమీపంలోని రైల్వే ట్రాక్‌ పైకి లారీని నడిపాడు. రైలు పట్టాల మధ్యలో ఇరుకున్న లారీ అక్కడి నుంచి ముందుకు కదలలేదు. దీంతో ఆ లారీని అక్కడే వదిలేసి డ్రైవర్‌ పారిపోయాడు. కాగా, గోల్డెన్ టెంపుల్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌ లూథియానా స్టేషన్‌కు చేరుకోవాల్సి ఉంది. అయితే రైలు పట్టాల మధ్యలో లారీ నిలిచి ఉండటాన్ని లోకో పైలట్‌ గమనించాడు. వెంటనే ఎమర్జెన్సీ బ్రేకులు వేశాడు. దీంతో ఆ రైలు లారీని కొద్దిగా తాకి ఆగింది. ఈ సంఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరుగలేదు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆస్కార్ కు నామినేషన్ విషయాన్ని ప్రకటించిన హీరో విక్రాంత్ మాసే

ఎట్టకేలకు కదిలిన ప్రపంచంలోనే అతిపెద్ద మంచుఫలకం

హర్భజన్‌సింగ్‌ను అనుకరిస్తూ బౌలింగ్‌.. నెట్టింట నవ్వులు పూయిస్తున్న వీడియో

TOP 9 ET News: రూ.300 కోట్ల రెమ్యూనరేషన్..దటీజ్‌ ఐకాన్ స్టార్ రేంజ్‌! |మర్చిపోలేకున్నా..సమంత ఎమోషన్

Rathika Rose: భారీగా రెమ్యూనరేషన్‌ !! పాపకు బానే గిట్టుబాటైంది !!