Soul: మరణం తరువాత మరో ప్రపంచంలోకి ఆత్మ.. ఆత్మ ఉందని ప్రూవ్ చేస్తా అంటున్న డాక్టర్.

|

Sep 03, 2023 | 9:22 AM

మనిషి మరణం తర్వాత ఏం జరుగుతుంది? ఆ జీవి ఎక్కడికి వెళ్తోంది? మరణం తర్వాత శరీరం నాశనమవుతుంది. మరి అంతవరకూ ఆ శరీరంలో ఉన్న చైతన్య శక్తి ఎక్కడికి వెళ్తోంది? ఏమవుతోంది అన్నది ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్న. మానవ శరీరం అశాశ్వతమైనదే కానీ ఆత్మ మాత్రం శాశ్వతమని భగవద్గీతలో కృష్ణపరమాత్ముడు బోధించాడు. ఇతర మతాలు కూడా ఆత్మ ఉనికిని అంగీకరిస్తాయి. సైన్స్ మాత్రం ఇదంతా ట్రాష్ అని కొట్టిపారేసినా...

మనిషి మరణం తర్వాత ఏం జరుగుతుంది? ఆ జీవి ఎక్కడికి వెళ్తోంది? మరణం తర్వాత శరీరం నాశనమవుతుంది. మరి అంతవరకూ ఆ శరీరంలో ఉన్న చైతన్య శక్తి ఎక్కడికి వెళ్తోంది? ఏమవుతోంది అన్నది ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్న. మానవ శరీరం అశాశ్వతమైనదే కానీ ఆత్మ మాత్రం శాశ్వతమని భగవద్గీతలో కృష్ణపరమాత్ముడు బోధించాడు. ఇతర మతాలు కూడా ఆత్మ ఉనికిని అంగీకరిస్తాయి. సైన్స్ మాత్రం ఇదంతా ట్రాష్ అని కొట్టిపారేసినా… కొందరు శాస్త్రవేత్తలు మాత్రం ఈ దిశగా పరిశోధనలు చేస్తూ నిజానిజాలను వెలికితీసేందుకు, శాస్త్రీయంగా నిరూపించేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఓ అమెరికాకు చెందిన వైద్యుడు ఆత్మ నిజమేనని, మరణం తరువాత దానికి ఓ జీవితం ఉందని సంచలన ప్రకటన చేశారు. మరణం అంచులవరకూ వెళ్లిన 5 వేల మందిని శాస్త్రీయంగా అధ్యయనం చేశానని, మరణం తర్వాత ఆత్మ ఉనికిని, మరో ప్రపంచాన్ని గుర్తించానని ప్రకటించారు. కెంటకీకి చెందిన రేడియేషన్ ఆంకాలజిస్ట్ డా. జెఫ్రీ లాంగ్.. 5 వేల పైగా నియర్ డెత్ ఎక్స్‌పీరియన్సెస్‌ను అధ్యయనం చేశారు.

మరణం తరువాత జీవితం ఉందని ప్రకటించారు. మరణం తరువాత మనుషులకు ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు ఆయన 1998లోనే నియర్ డెత్ ఎక్స్‌పీరియన్స్ రీసెర్చ్ షౌండేషన్ స్థాపించారు. గుండె ఆగిపోవడం లేదా కోమాలో ఉన్న వారు అనుభవించే స్థితినే నియర్ డెత్ ఎక్స్‌పీరియన్స్ అంటారని డా. జెఫ్రీ వివరించారు. మరణం అంచుల వరకూ వెళ్లి తిరిగొచ్చిన ఇలాంటి వారిలో కొందరు తమ శరీరం పనిచేయకపోయినా చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూడగలిగారని, ఇతరులతో సంభాషించగలిగారని తెలిపారు. నియర్ డెత్ అనుభవం చవిచూసిన వారిలో దాదాపు 45 శాతం మంది తమ ఆత్మ శరీరం నుంచి వేరు పడిన విషయాన్ని గుర్తించారు. శరీరం నుంచి వెలుపలికి వచ్చిన ఆత్మ అక్కడే గాల్లో కాసేపు తచ్చాడిందని, దీంతో, వారు అక్కడ జరుగుతున్న అన్ని విషయాలను ప్రత్యక్షంగా చూస్తూ వినగలిగారని చెప్పుకొచ్చారు. మరికొందరు మాత్రం తమ ఆత్మ ఓ సొరంగంలోంచి ప్రయాణిస్తూ ఓ వెలుతురు వైపు పయనించినట్టు చెప్పుకొచ్చారన్నారు. గతంలో మరణించిన తమ బంధువులు, స్నేహితులను కలుసుకున్నట్టు తెలిపారని చెప్పారు. తమ జీవితం మొత్తం క్షణకాలం పాటు తమ కళ్లముందు కదిలిందని చెప్పినట్టు వివరించారు. ఇవన్నీ సినిమాల్లో చూపించే ఘటనలు లాగా ఉన్నప్పటికీ కొందరు పిల్లలు, ముఖ్యంగా ఇలాంటి కథలు, ఆత్మల గురించి తెలియని వారు కూడా ఇదే అనుభవాన్ని పొందిన విషయాన్ని డా. జెఫ్రీ లాంగ్ స్పష్టం చేశారు. ఇలాంటి అనుభవాల్ని శాస్త్రీయంగా వివరించే ఆధారలేవీ దొరకలేదన్న ఆయన ఆత్మలు, మరణం తరువాత జీవితం మాత్రం నిజమని తేల్చి చెప్పారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..

Follow us on