Viral: పొలం చదును చేస్తుండగా దొరికిన వజ్రం.. 2 లక్షల రూపాయలకు అమ్మేశాడు.

Viral: పొలం చదును చేస్తుండగా దొరికిన వజ్రం.. 2 లక్షల రూపాయలకు అమ్మేశాడు.

Anil kumar poka

|

Updated on: Sep 03, 2023 | 9:15 AM

ఆరుగాలం కష్టపడి పనిచేసినా పంటకు గిట్టుబాటు ధర లేకో, ప్రకృతి వైపరీత్యాలతోనో అన్నదాత ఎప్పుడూ నష్టపోతూనే ఉంటాడు. అయినా నేలతల్లిని నమ్ముకునే జీవనం సాగిస్తాడు. అతని నమ్మకం వమ్ముకాలేదు. నేలతల్లి వజ్రం రూపంలో రైతును కరుణించింది. ఒక్కరోజులోనే లక్షాధికారిని చేసింది. అవును కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి గ్రామానికి చెందిన ఓ ఉంరైతు పొలం పనులు చేస్తుండగా వజ్రం లభించింది.

ఆరుగాలం కష్టపడి పనిచేసినా పంటకు గిట్టుబాటు ధర లేకో, ప్రకృతి వైపరీత్యాలతోనో అన్నదాత ఎప్పుడూ నష్టపోతూనే ఉంటాడు. అయినా నేలతల్లిని నమ్ముకునే జీవనం సాగిస్తాడు. అతని నమ్మకం వమ్ముకాలేదు. నేలతల్లి వజ్రం రూపంలో రైతును కరుణించింది. ఒక్కరోజులోనే లక్షాధికారిని చేసింది. అవును కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి గ్రామానికి చెందిన ఓ ఉంరైతు పొలం పనులు చేస్తుండగా వజ్రం లభించింది. ఆ వజ్రాన్ని జొన్నగిరి గ్రామానికి చెందిన వజ్రాల వ్యాపారి 2 లక్షల రూపాయలకు కొనుగోలు చేశారు. రైతుకు ఆ మాత్రం మొత్తం లభించడమే ఆనందమైపోయింది. అయితే ఆ వజ్రం చాలా విలువైనదని వజ్రాల వ్యాపారులు చర్చించుకుంటున్నారు. ఆగస్టు 31 ఉదయం పొలానికి వెళ్ళిన రైతు పొలం పనులు చేస్తుండగా వజ్రం దొరికింది. మొదట్లో అది వజ్రమా కాదా అనుమానంతో వజ్రాల వ్యాపారి దగ్గరికి వెళ్లి చెక్‌ చేయించాడు. ఆ వజ్రాల వ్యాపారి అది వజ్రమేనని, రైతు చేతిలో 2 లక్షల రూపాయలు పెట్టి పంపించాడు. ఈవార్త ఆనోటా ఈనోటా ఇతర వజ్రాల వ్యాపారుల కు తెలియడంతో ఆ వజ్రం 10 లక్షల రూపాయలు విలువ చేస్తుందని తెలిపారు. ఒకసారి విక్రయించిన వజ్రాన్ని తిరిగి ఇమ్మనడం సరికాదని భావించిన రైతు వచ్చినదానితో సంతృప్తి చెందాడు. ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్లో దాదాపుగా ఇప్పటి వరకు 30 వజ్రాలు పైగా దొరికాయి. వారం రోజుల క్రితం మద్దికెర మండలం పెరవలి లో ఓ మహిళ పొలంలో కూలీ పనులు చేస్తుండగా ఓ వజ్రం లభించింది. పెరవలి కి చెందిన వజ్రాల వ్యాపారి ఆ వజ్రాన్ని 15 లక్షల నగదు, ఎనిమిది తులాలు బంగారం ఇచ్చి కొనుగోలు చేసినట్టు సమాచారం.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..