Viral: వర్షాలు కురవాలని ఊరు ఊరంతా కలిసి ఏం చేశారో తెలుసా..? గాడిదలను అందంగా ముస్తాబు చేసి..

| Edited By: Shaik Madar Saheb

Aug 08, 2023 | 7:56 PM

వేసవి కాలం ముగిసింది.. వర్షాకాలం వచ్చేసింది. అన్నదాతలు ఆశగా ఆకాశం వైపు చూస్తున్నారు.. కానీ, ఆ మబ్బుల చాటున దాగున్న వరుణుడు మాత్రం అన్నదాత వైపు..కరువు సీమ వైపు చూడకుండా ముఖం చాటేశాడు. దీంతో వర్షాకాలంలో కూడా వర్షాలు కురవడం లేదు.. ఇప్పుడిదే అన్నదాతకు పెద్ద సమస్యగా మారింది. కరువుసీమలో వర్షాధారిత ప్రాంతాలే ఎక్కువ.

అనంతపురం, ఆగస్టు 08: వేసవి కాలం ముగిసింది.. వర్షాకాలం వచ్చేసింది. అన్నదాతలు ఆశగా ఆకాశం వైపు చూస్తున్నారు.. కానీ, ఆ మబ్బుల చాటున దాగున్న వరుణుడు మాత్రం అన్నదాత వైపు..కరువు సీమ వైపు చూడకుండా ముఖం చాటేశాడు. దీంతో వర్షాకాలంలో కూడా వర్షాలు కురవడం లేదు.. ఇప్పుడిదే అన్నదాతకు పెద్ద సమస్యగా మారింది. కరువుసీమలో వర్షాధారిత ప్రాంతాలే ఎక్కువ. చినుకు పడితే గానీ.. హలం కదలదు… కర్షకులకు పని ఉండదు. కరువు సీమలో రైతు పంట పండించాలంటే వర్షమే ఆధారం.. కానీ ఆ వానజాడ లేకపోవడంతో ఆ వాన దేవుని ప్రసన్నం చేసుకోవడం కోసం రకరకాల ఆచారాలు గ్రామస్తులు పాటిస్తూనే ఉన్నారు. అందులో ఒకటే అనంతపురం జిల్లాలో జరిగిన గాడిదల పెళ్లి.. ఉరవకొండ నియోజకవర్గంలోని వజ్రకరూరు మండలం చాబాలలో వర్షం కోసం గ్రామస్తులు గాడిదలకు పూజలు చేసి పెళ్లి చేశారు. ఇందుకోసం గాడిదలను పెళ్ళికొడుకు పెళ్ళికూతురుల మాదిరి అందంగా ముస్తాబు చేశారు. వాటిని ఊరేగిస్తూ.. అవి నడిచే దారిలో గాడిదల పాదాల వద్ద నీళ్లను చల్లి.. వర్షం కురిసేలా చేయాలని మొక్కుకొని ఊరేగింపు నిర్వహించారు. చాలా కాలంగా కప్పలకు పెళ్లి చేయడం.. గాడిదలకు పెళ్లి చేయడం లాంటి ఆచారాలు కరువు ప్రాంతాల్లో కనిపిస్తూనే ఉంటాయి. వీటిని నమ్మకాలని కొందరు.. మూఢనమ్మకాలని మరికొందరు వాదిస్తూనే ఉన్నా… అన్నదాత మాత్రం ఏం చేసి అయిన వర్షం పడాలని ఆశగా ఈ ఆచారాలన్నీ పాటిస్తూనే ఉన్నాడు. మంత్రాలకు చింతకాయలు రాలతాయో? లేదో? గానీ ఇలాంటివి చాలా చోట్ల కనిపిస్తున్నాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Published on: Aug 08, 2023 07:56 PM