Dog Viral Video: కుక్క గర్భవతి అని ఆసుపత్రికి తీసుకెళ్లాడు… టెస్ట్‌ చేసి ఆశ్చర్యపోయిన వైద్యులు.. షాక్‌కు గురి చేస్తున్న వీడియో..

|

Feb 28, 2022 | 9:37 AM

Strange Pregnancy: యూకేలో వింత ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన పెంపుడు కుక్క గర్భం దాల్చిందని ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అక్కడి వైద్యులు కుక్కకి ఎక్స్‌రే తీసిన వైద్యులు రిపోర్ట్‌ చూసి షాకయ్యారు. అసలేం జరిగిందంటే.. యూకేకి చెందిన నీల్ టేలర్ అనే వ్యక్తి తన పెంపుడు కుక్క..


Dog Strange Pregnancy: యూకేలో వింత ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన పెంపుడు కుక్క గర్భం దాల్చిందని ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అక్కడి వైద్యులు కుక్కకి ఎక్స్‌రే తీసిన వైద్యులు రిపోర్ట్‌ చూసి షాకయ్యారు. అసలేం జరిగిందంటే.. యూకేకి చెందిన నీల్ టేలర్ అనే వ్యక్తి తన పెంపుడు కుక్క ఆల్ఫీ కొన్ని రోజులుగా వాంతులు చేసుకుంటూ నీరసంగా ఉండటంతో. కుక్క కడుపుతో ఉందనుకుని ఆనందంగా వెటర్నరీ ప్రాక్టీస్ క్లినిక్‌కి తీసుకెళ్లాడు. అయితే అక్కడ డాక్టర్లు ఆ కుక్కని పరీక్షించి ఎక్క్‌రే తీశారు. ఎక్స్‌రే చూసి ఖంగుతిన్న వైద్యులు అసలు విషయం నీల్‌కి వివరించారు. కుక్క కడుపులో చాలా గోల్ఫ్‌ బంతులు ఉన్నాయని చెప్పారు. దీంతో ఆ కుక్కకి వైద్యులు సర్జరీ చేసి ఏకంగా 25 గోల్ఫ్‌ బంతులను కడుపులోంచి తీశారు. ఇన్ని గోల్ఫ్‌ బంతులు కుక్క కడుపులోకి ఎలా వచ్చాయో తెలియదని టేలర్‌ చెప్పాడు. అయితే కొద్ది రోజుల క్రితం నీల్ టేలర్.. తన కుక్కతో కలిసి గోల్ఫ్ కోర్టుకు వెళ్లినట్లు చెప్పాడు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఆల్ఫీ పరిస్థితి విషమించడం ప్రారంభించిందని, ఆకస్మాత్తుగా ఆల్ఫీకి వాంతులు అవ్వడం, నీరసంగా మారిపోవడం జరిగిందని వాపోయాడు. కానీ ఆల్ఫీ ఇన్ని బంతులు మింగినట్లు తాను గమనించలేదని చెప్పుకొచ్చాడు. అయితే నీల్‌కి ఆ ఆసుపత్రి సర్జరీ కోసం సుమారు 2 లక్షల 37 వేల బిల్లు వేశారు. నీల్‌ మాత్రం తన కుక్క ప్రాణాలతో సురక్షితంగా ఉన్నందుకు ఆనందంగా ఉందన్నాడు.

మరిన్ని చూడండి ఇక్కడ:

Syed Sohel Ryan: ట్రెండ్ మారింది..! స్టైలిష్ లుక్ లో అదరగొడుతున్న బిగ్ బాస్ ఫేమ్ ‘సోహెల్’..