Dog donates blood: శునకం రక్తదానం.. గర్భిణీ శునకానికి పోసింది ప్రాణం.. వీడియో.

|

Mar 21, 2023 | 9:51 AM

కర్ణాటకలో ఓ శునకం పెద్ద మనసును చాటుకుంది. అనారోగ్యానికి గురైన తోటి శునకానికి రక్త దానం చేసింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. జిప్సీ అనే రెండు నెలల శునకం అనారోగ్యం పాలైంది. అయితే

కర్ణాటకలో ఓ శునకం పెద్ద మనసును చాటుకుంది. అనారోగ్యానికి గురైన తోటి శునకానికి రక్త దానం చేసింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. జిప్సీ అనే రెండు నెలల శునకం అనారోగ్యం పాలైంది. అయితే ఈ విషయాన్ని తెలుసుకున్న జిమ్మి అనే శునకం యజమాని దాని రక్తాన్ని దానం చేయించాడు. జిప్సీ రెండు నెలల గర్భవతి. దానికి ఆరోగ్యం బాగోలేకపోతే దాని యజమాని వెటర్నిటీ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. జిప్సీ రక్తలేమి సమస్యతో బాధపడుతోందని వైద్యులు చెప్పారు. దీంతో వేరే శునకం రక్తం అవసరం పడింది. డాక్టర్ కూడా జిప్సీకి రక్తం ఇస్తే బాగుంటుందని సలహా ఇచ్చాడు. ఈ విషయం గురించి తెలుసుకున్న జిమ్మీ యజమాని వైభవ్​ పాటిల్.. ఆ శునకానికి రక్తదానం చేయించాలనుకున్నాడు. ఆస్పత్రికి వెళ్లి జిప్సీకి రక్తదానం చేయించాడు వైభవ్. గర్భిణి జిప్సీకి రక్తం అందించడం వల్ల.. ఇప్పుడు దాని ఆరోగ్యం మెరుగుపడింది. రక్తం డొనేట్ చేసినందుకు జిప్సీ యజమాని.. జిమ్మీ యజమానికి ధన్యవాదాలు తెలిపారు.హవేరిలోని హనగల్ తాలూకాలోని అక్కి ఆలూర్ రక్త దానానికి ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ప్రతి ఇంట్లో ఒక శునక రక్త దాతని మనం చూడవచ్చు. రక్తం అవసరమైన వారికి సహాయం చేసేందుకు అక్కి ఆలూరులో రక్తదాతల బృందం ఏర్పడింది. జిప్సీ, జిమ్మీల యజమానులు కూడా ఈ బృందంలో సభ్యులుగా ఉన్నారు. మనుషులు రక్త లోపంతో ఉంటే వెంటనే వెళ్లి ఎవరో ఒకరు రక్త దానం చేస్తుంటారు. శునకాలు రక్త లోపంతో బాధపడుతున్నప్పుడు కూడా మనుషుల లాగానే వాటికి అవసరమైనప్పుడు రక్తం లభించడం గొప్ప విశేషం.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jr.NTR – Ram Charan: ఎన్టీఆర్ తోపా..! రామ్ చరణ్ తోపా ..? డాన్స్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్..
Viral Video: ఇది బైక్ కాదు పుష్పక విమానం.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు..! వైరల్ వీడియో..
Vidya Balan: ఆ దర్శకుడు నన్ను రూమ్‌కు రమ్మన్నాడు.. విద్యాబాలన్‌. వీడియో

Follow us on