ఘోర రోడ్డు ప్రమాదం చనిపోయిన తన తల్లికి, చెల్లికి అంత్యక్రియలు చేసిన యువ వైద్యురాలు.. ( వీడియో)

Phani CH

|

Updated on: Jun 19, 2021 | 9:25 PM

ఎప్పుడూ నవ్వుతూ హాయిగా సుఖ శాంతులతో సాఫీగా సాగే ఆ సంసారంలో రోడ్డు ప్రమాదం కటిక చీకటిని మిగిల్చింది. ఇద్దరినీ మృత్యువు కబళించడంతో ఆ కుటుంబం మొత్తం దు:ఖ సాగరంలో మునిగిపోయింది.

ఎప్పుడూ నవ్వుతూ హాయిగా సుఖ శాంతులతో సాఫీగా సాగే ఆ సంసారంలో రోడ్డు ప్రమాదం కటిక చీకటిని మిగిల్చింది. ఇద్దరినీ మృత్యువు కబళించడంతో ఆ కుటుంబం మొత్తం దు:ఖ సాగరంలో మునిగిపోయింది. వివరాల్లోకి వెళితే.. తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలం చెముడులంక (గాంధీనగరం) చెందిన జనసేన జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు చోడిశెట్టి చంద్రశేఖర్ సోదరి సింగలూరి వీర ధనలక్ష్మి, తన భర్త శ్రీనివాస్, కుమార్తె కావ్యతో కలిసి చెముడులంక నుండి విశాఖ జిల్లా కారులో వెళుతున్నారు. అయితే, వాళ్లు ప్రయాణిస్తోన్న కారు విశాఖపట్నం సమీపంలో ఆగి ఉన్న లారీని కారు బలంగా ఢీకొట్టింది. దీంతో కుమార్తె కావ్య, ధనలక్ష్మి స్పాట్ లోనే మృతి చెందగా భర్త శ్రీనివాస్ కు తీవ్రగాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Gold And Silver Price: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. దిగొస్తున్న బంగారం వెండి ధరలు.. ( వీడియో )

Mystery Iland: చిక్కుడు గింజ ఆకారంలో రహస్య దీవి ప్రత్యక్షం.. రంగంలోకి దిగిన శాస్త్రజ్ఞులు.. ( వీడియో )