Kolkata: కోల్ కతా డాక్టర్ హత్యాచారం కేసులో DNA రిపోర్టే కీలకం.!

|

Aug 26, 2024 | 9:06 AM

కోల్‌కతా జూనియర్‌ వైద్యురాలిపై హత్యాచార ఘటనలో సంచలన విషయాలు బయటికొస్తున్నాయి. హత్యాచారం ముందు రోజు నిందితుడు ఆస్పత్రిలో స్వేచ్ఛగా తిరుగుతూ బాధిత వైద్యురాలిని గమనించిన దృశ్యాలు సీసీటీవీలో బయటపడ్డాయి. ఈ కేసులో గ్యాంగ్ రేప్‌ జరిగిందని ఆరోపణలు వస్తున్న వేళ డీఎన్​ఏ రిపోర్ట్‌ ఇప్పుడు కీలకంగా మారింది. అయితే వైద్యురాలిపై సామూహిక అత్యాచారం జరగలేదని,

కోల్‌కతా జూనియర్‌ వైద్యురాలిపై హత్యాచార ఘటనలో సంచలన విషయాలు బయటికొస్తున్నాయి. హత్యాచారం ముందు రోజు నిందితుడు ఆస్పత్రిలో స్వేచ్ఛగా తిరుగుతూ బాధిత వైద్యురాలిని గమనించిన దృశ్యాలు సీసీటీవీలో బయటపడ్డాయి. ఈ కేసులో గ్యాంగ్ రేప్‌ జరిగిందని ఆరోపణలు వస్తున్న వేళ డీఎన్​ఏ రిపోర్ట్‌ ఇప్పుడు కీలకంగా మారింది. అయితే వైద్యురాలిపై సామూహిక అత్యాచారం జరగలేదని, డీఎన్​ఏ రిపోర్ట్స్‌ వచ్చిన తర్వాత ఎంతమంది ప్రమేయం ఉందో తేలుతుందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. నిందితుడు సంజయ్‌ రాయ్‌.. ఘటనకు ముందు రోజు ఆస్పత్రిలోని చెస్ట్‌ మెడిసన్‌ వార్డ్‌లో ఉన్నట్లు ఒప్పుకున్నాడు.

ఆ సమయంలో అదే వార్డులో బాధితురాలితో పాటు మరో నలుగురు జూనియర్ వైద్యులు ఉన్నారు. వారిని నిందితుడు గమనిస్తున్నట్లు సీసీటీవీ దృశ్యాల్లో నమోదైంది. ఆ నలుగురు జూనియర్‌ డాక్టర్ల వాంగ్మూలాన్ని కూడా సీబీఐ రికార్డు చేసింది. మరోవైపు బాధితురాలిపై సామూహిక అత్యాచారం జరగలేదని, డీఎన్​ఏ రిపోర్ట్‌ వచ్చాకే అసలు విషయం తేలుతుందని సంబంధిత వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం ఈ నమూనాలను సీబీఐకి చెందిన సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీలో పరీక్షిస్తున్నారు. త్వరలోనే నివేదిక అందుబాటులోకి రానుంది. బాధితురాలిపై సామూహిక అత్యాచారం జరిగినట్లు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న కథనాలను ఇప్పటికే కోల్‌కతా పోలీసులు తోసిపుచ్చారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.