Wayanad: పోస్టుమార్టం చేయలేక పారిపోవాలనుకున్నా.! రాత్రంతా ఏనుగు పక్కనే..

|

Aug 05, 2024 | 8:21 AM

కేరళలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఛిద్రమైన మృతదేహాలకు పోస్టుమార్టం చేయలేక పారిపోవాలనుకున్నట్లు ఓ ప్రభుత్వ వైద్యురాలు చెప్పడం అక్కడి పరిస్థితులకు అద్దం పడుతోంది. ఎన్నో ఏళ్లుగా వైద్య వృత్తిలో ఉన్న తాను ఇప్పటివరకు ఎన్నో మృతదేహాలకు పోస్టుమార్టం చేసినా ఇలాంటి పరిస్థితులు ఎన్నడూ చూడలేదని ఓ వైద్యురాలు తెలిపారు. ఓ శరీరం చూస్తే మొత్తం ఛిద్రమైందని రెండో దాన్ని చూడలేకపోయినట్లు చెప్పారు.

కేరళలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఛిద్రమైన మృతదేహాలకు పోస్టుమార్టం చేయలేక పారిపోవాలనుకున్నట్లు ఓ ప్రభుత్వ వైద్యురాలు చెప్పడం అక్కడి పరిస్థితులకు అద్దం పడుతోంది. ఎన్నో ఏళ్లుగా వైద్య వృత్తిలో ఉన్న తాను ఇప్పటివరకు ఎన్నో మృతదేహాలకు పోస్టుమార్టం చేసినా ఇలాంటి పరిస్థితులు ఎన్నడూ చూడలేదని ఓ వైద్యురాలు తెలిపారు. ఓ శరీరం చూస్తే మొత్తం ఛిద్రమైందని రెండో దాన్ని చూడలేకపోయినట్లు చెప్పారు. అది ఏడాది చిన్నారిదనీ అటువంటి మృత దేహాలు వరుసగా వస్తూనే ఉన్నాయని భావోద్వేగంతో చెప్పారు. ఇక పోస్టుమార్టం చేయలేనని అనుకుని ఆ ప్రాంగణం నుంచి రిలీఫ్‌ క్యాంప్‌కు పారిపోదామనుకున్నట్లు చెప్పారు. కానీ వేరే మార్గం లేక అలా మొత్తంగా 18 మృతదేహాలకు శవ పరీక్ష నిర్వహించినట్లు సదరు వైద్యురాలు వివరించారు.
వాయిస్‌03: ఇదిలా ఉంటే .. టీ తోటలో పనిచేసే సుజాత అనే వృద్ధురాలు.. తీవ్రంగా వరద రావడంతో మంగళవారం రాత్రి ఆమె కొండపైకి చేరుకున్నారు. పక్కనే అడవి ఉండటంతో ఏనుగు వచ్చింది. దీంతో ఆమెతో పాటు మనవరాలు దాని పక్కనే భయం భయంగా గడిపారు. కాగా.. వయనాడ్‌ బాధితులకు సహాయం చేయాలని కేరళ ముఖ్యమంత్రి విజయన్‌ ఇచ్చిన పిలుపుపై కొన్ని సోషల్‌ మీడియా అకౌంట్లు వ్యతిరేక ప్రచారానికి దిగాయి. దాంతో మొత్తం 194 వ్యతిరేక పోస్టులను గుర్తించిన పోలీసులు 14 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు.

వయనాడ్‌ విషాదంపై పబ్లిక్‌గా మాట్లాడొద్దని శాస్త్రవేత్తలను హెచ్చరించిన కేరళ ప్రభుత్వం నాలుక్కరుచుకుంది. కొండ చరియలు విరిగిపడిన ఘటనపై గత నివేదికలను ప్రస్తావిస్తూ విశ్లేషణలు చేయొద్దంటూ ముందుగా శాస్త్రవేత్తలకు రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ ఆదేశాలు జారీ చేసింది. దీనిపై విమర్శలు రావడంతో ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ జోక్యం చేసుకుని ఆదేశాలను వెంటనే ఉపసంహరించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us on