అయోధ్య వీధుల్లో సుందర దృశ్యం.. పులకించి పోయిన రామ భక్తులు

|

Feb 04, 2024 | 9:00 PM

జనవరి 22న అయోధ్యలో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది.. రామాలయం ప్రారంభోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా రామ్‌లల్లా ప్రాణప్రతిష్ట కార్యక్రమం నిర్వహించిన అనంతరం ఆలయాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత ప్రతిరోజూ లక్షలాది మంది అయోధ్యలో దర్శనం కోసం బారులు తీరుతున్నారు. ఈ క్రమంలోనే అయోధ్య రోడ్లపై గతంలో ఎన్నడూ చూడని అందమైన, అపూర్వమైన దృశ్యం కనువిందు చేసింది.

జనవరి 22న అయోధ్యలో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది.. రామాలయం ప్రారంభోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా రామ్‌లల్లా ప్రాణప్రతిష్ట కార్యక్రమం నిర్వహించిన అనంతరం ఆలయాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత ప్రతిరోజూ లక్షలాది మంది అయోధ్యలో దర్శనం కోసం బారులు తీరుతున్నారు. ఈ క్రమంలోనే అయోధ్య రోడ్లపై గతంలో ఎన్నడూ చూడని అందమైన, అపూర్వమైన దృశ్యం కనువిందు చేసింది. అయోధ్యకు వస్తున్న భక్తులు కూడా ఈ దృశ్యాన్ని చూసి సంతోషిస్తున్నారు. అయోధ్యలోని రోడ్లను డిజిటల్ రంగోలీలతో అలంకరించారు. అంతేకాదు.. రహదారి పొడవునా ఉన్న విద్యుత్ స్తంభాలను కూడా వివిధ అందమైన డిజైన్లలో రంగురంగుల లైట్లతో ప్రకాశింపజేశారు. రామభక్తులు ఈ సుందర దృశ్యాన్ని చూసి చాలా సంతోషించారు. పలువురు ఈ రంగోలిలతో సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. రోడ్డుపై కొంత దూరం నుంచి కనిపించే రంగురంగుల లైట్ల రంగోలిలు అయోధ్య సందర్శకులకు ఆకర్షణగా మారుతున్నాయి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఏనుగు లైట్‌ తీసుకుంది గానీ.. లేదంటే చుక్కలే

Donald Trump: చేతిపై ఎర్రని మచ్చలు.. ట్రంప్ కు ఏమైంది ??

భార్య సాయంతో తండ్రిగా మారిన ట్రాన్స్‌జెండర్‌

‘సారీ.. మీ బాధ ఎవరికీ రాకూడదు’ తల్లితండ్రుల క్షమాపణ కోరిన జుకర్‌బర్గ్‌

నెత్తురుతో వ్యాపారం.. వెలుగులోకి సంచలన నిజాలు

Follow us on