Tuvalu Island: ఇంట్లోనే ఉండి మీరు ఈ అందమైన దేశానికి వెళ్లొచ్చు..! ఎలా అంటే..?
వాతావరణ కాలుష్యంతో పర్యావరణం అంతరించిపోతోంది. పర్యావరణ పరిరక్షణకు కఠిన చర్యలు చేపడతామని ప్రతి ఏటా ప్రపంచదేశాలు తీర్మానాలు చేస్తున్నాయి. అయినప్పటికీ....
వాతావరణ కాలుష్యంతో పర్యావరణం అంతరించిపోతోంది. పర్యావరణ పరిరక్షణకు కఠిన చర్యలు చేపడతామని ప్రతి ఏటా ప్రపంచదేశాలు తీర్మానాలు చేస్తున్నాయి. అయినప్పటికీ సముద్ర మట్టాలు పెరిగి దేశ భూభాగం కనుమరుగైపోతోంది. భవిష్యత్తు తరాలకు తమ సంస్కృతి, సంప్రదాయాలను తెలియజేసేందుకు ఓ ద్వీపం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో తమ దేశాన్ని డిజిటల్ దేశంగా మారుస్తామని తువాలు ఐలాండ్ ప్రకటించింది. ఆస్ట్రేలియా – హవాయిల దేశాల మధ్య ఉన్న తొమ్మిది దీవుల సమూహం తువాలు ఐలాండ్. ఇక్కడ 12 వేల మంది నివసిస్తున్నారు. ఇప్పటికే తువాలు రాజధాని ప్రాంతం 40 శాతం సముద్రంలో కలిసిపోయింది. ఇదిలాగే కొనసాగితే ఈ దశాబ్దం చివరికి తువాలు పూర్తిగా కనుమరుగైపోవడమే కాకుండా, ప్రపంచంలో గ్లోబల్ వార్మింగ్‌కు బలయ్యే తొలి ద్వీపం ఇదే కానుందని పర్యావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈనేపథ్యంలో భవిష్యత్తు తరాలకు తువాలు దేశ సంస్కృతి, సంప్రదాయాలను తెలియజేసేందుకు మెటావర్స్‌లో ఈ దేశాన్ని రూపొందించనున్నట్లు ఆ దేశ మంత్రి సైమన్ కోఫే తెలిపారు. మెటావర్స్ ద్వారా అక్కడి ప్రకృతి అందాలను, ప్రజల జీవనశైలిని పర్యాటకులు చూడొచ్చన్నారు. తమ దేశ భూమిలో కొద్ది కొద్దిగా కనుమరుగైపోతుంది. భవిష్యత్తులో తువాలు ఉనికి ప్రపంచదేశాలకు తెలియాలంటే మా దేశాన్ని పూర్తి డిజిటల్ నేషన్‌గా మార్చడం మినహా మరో దారిలేదు. త్వరలోనే తువాలు తొలి వర్చువల్ దేశంగా ప్రపంచ ప్రజలకు దర్శనమివ్వబోతుందని సైమన్ తెలిపారు. తువాలును మెటావర్స్ దేశంగా మార్చేందుకు ది మంకీస్, కొల్లైడర్ అనే రెండు సంస్థలు పనిచేస్తున్నాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Ranbir Kapoor: సెలబ్రిటీ లైఫ్ ఈజీ కాదంటున్న రణబీర్.. ఏమైయింది అంటే..? వీడియో
Allu Arjun – Shah Rukh Khan: షారుఖ్‌కు దిమ్మతిరిగే పంచ్ ఇచ్చిన బన్నీ.. వీడియో.
Allu Arjun: అర్జున్ రెడ్డి 2.O.. వచ్చేస్తున్నాడు పాన్ ఇండియా మూవీ.. కాస్కోండి మరి..!
దారుణం.. ఆకలితో తండ్రి మృతి.. అస్థిపంజరంలా కుమార్తె
విమానం కిటికీ అద్దంపై అతను చేసిన పనికి
తేనెటీగకు లీగల్ హక్కు !! పెరిగిన ప్రాముఖ్యత
జేబులోనే మృత్యువు.. కాపాడాల్సిన ఆయుధమే.. ఆయువు తీసింది
ప్రాణాలు నిలబెట్టేందుకు.. పూల హెల్మెట్ల ప్రచారం
కొత్త ఏడాదిలో సెలవులే సెలవులు !! ఉద్యోగులకు లాంగ్ వీకెండ్స్
బ్యాంక్‌లో తిష్ట వేసి రూ. 316 కోట్లు దోచేసిన దొంగలు

