Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెళ్లికొడుకు.. పెళ్లికుమార్తె మండపంలో లేరు.. అయినా సాంప్రదాయబద్ధంగా వివాహం జరిగిపోయింది..:Viral Video.

పెళ్లికొడుకు.. పెళ్లికుమార్తె మండపంలో లేరు.. అయినా సాంప్రదాయబద్ధంగా వివాహం జరిగిపోయింది..:Viral Video.

Anil kumar poka

|

Updated on: Aug 18, 2021 | 12:30 PM

పెళ్లి కుమారుడు.. పెండ్లి కుమార్తె వివాహ మండపంలో లేరు. అయినా వారి వివాహం సంప్రదాయబద్దంగా వేద మంత్రాలు బంధువుల సమక్షంలో అంగరంగవైభవంగా నిర్వహించారు. అందేంటి వివాహ కార్యక్రమంలో పెండ్లి కుమారుడు కుమార్తె లేకుండా వివాహం ఎలా జరిగిందని సందేహ పడుతున్నారా.. ?

వధువరులు లేని పెండ్లి మండపంలో.. ఎంతో గ్రాండ్‌గా వివాహం జరిగింది. అవును మీరు విన్నది నిజమే.. పెళ్లి మండపంలో పెళ్లి కొడుకు, పెళ్లి కూతురులిద్దరూ.. లేనప్పటికీ.. ఎంతో సంప్రదాయబద్దంగా వేద మంత్రాల సాక్షిగా అంగరంగవైభవంగా వివాహం జరిపించారు కుటుంబసభ్యులు. మీకు ఇంకా అర్థం కాలేదా..? అయితే ఈ కంఫ్యూజన్‌ నుంచి బయటకు రావాలంటే ఈ స్టోరీ చూస్సెయండి.. మీకే అర్థం అవుతుంది.
కరోనా నేపథ్యంలో ఆన్ లైన్‌లో విద్యార్థులకు తరగతులు నిర్వహించడం మనం చుశాం… అదే తరహలో వివాహాలు సైతం ఆన్ లైన్‌లో జరుగుతున్నాయి. కర్నూలుకు చెందిన మధుసూదన్ రెడ్డి, శైలజారెడ్డి దంపతుల కుమార్తె రజితకు, నల్గొండకు చెందిన దినేష్ రెడ్డిల వివాహం కర్నూలులోని ఓ ఫంక్షన్ హాల్లో ఆన్‌ లైన్‌లో జరిగింది. రజిత, దినేష్ రెడ్డిలకు రెండు సంవత్సరాల క్రితం వివాహం జరిపించాలని ఇరు కుటుంబాల పెద్దలు నిర్ణయించారు. కానీ రజిత, దినేష్ రెడ్డిలు ఉద్యోగ రిత్యా ఆస్ట్రేలియాలోనే ఉండిపోవడం పెళ్లి పోస్ట్‌పోన్‌ అవుతూ వస్తోంది.


మరిన్ని ఇక్కడ చూడండి : ఎస్‌బిఐ రాఖీ పండుగ ఆఫర్.. అది ఈ యాప్‌తో షాపింగ్ చేస్తే..:SBI Raksha Bandhan Offer Video.

 పెట్రోల్ ధరలు తగ్గుతాయా..?అనే ప్రశ్నకు.. నిర్మలాసీతారామన్‌ ఏమన్నారంటే.. :Fuel Prices Video.

 దెయ్యాలు వేదాలు వల్లించినట్లు… తాలిబన్లు మరిన్ని వార్తా కథనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్…:News Watch Video.

 ఈ చిన్నారి ఇప్పుడు ప్రపంచస్థాయి గుర్తింపు పొందిన హీరోయిన్.. ఎవరో గెస్ చెయ్యగలరా ..?:Celebrity Baby Picture Video.

Published on: Aug 18, 2021 08:49 AM