రెయిలింగ్ పైనుంచి దూకుతున్న మొసలిని చూశారా ??
ఉత్తరప్రదేశ్ లోని బులంద్ షహర్ పట్టణంలో ఓ 10 అడుగుల భారీ మొసలి కలకలం సృష్టించింది. నరోరా ఘాట్ వద్ద గంగానది కాలువలోంచి ఒక్కసారిగా బయటకు దూసుకొచ్చిన మొసలి అక్కడున్న ఇనుప రెయిలింగ్ పైనుంచి దూకేందుకు ప్రయత్నించింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఆహారం కోసం కాలువలోంచి ఓ పెద్ద మొసలి బయటకు రావడాన్ని గమనించిన స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
ఉత్తరప్రదేశ్ లోని బులంద్ షహర్ పట్టణంలో ఓ 10 అడుగుల భారీ మొసలి కలకలం సృష్టించింది. నరోరా ఘాట్ వద్ద గంగానది కాలువలోంచి ఒక్కసారిగా బయటకు దూసుకొచ్చిన మొసలి అక్కడున్న ఇనుప రెయిలింగ్ పైనుంచి దూకేందుకు ప్రయత్నించింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఆహారం కోసం కాలువలోంచి ఓ పెద్ద మొసలి బయటకు రావడాన్ని గమనించిన స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులతోపాటు అటవీ శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. వారు మొసలిని పట్టుకొనేందుకు ప్రయత్నించగా అది తప్పించుకోవాలని చూసింది. ఇనుప రెయిలింగ్ పైనుంచి దూకేందుకు ప్రయత్నించింది. అయితే పైదాకా ఎక్కినా రెయిలింగ్ ను దాటడం సాధ్యంకాక మళ్లీ కింద పడింది. ఈ క్రమంలో ఆ మొసలి గాయపడినట్టు తెలిసింది. దీంతో అటవీ అధికారులు ఆ మొసలిని బందించేందుకు ఎలాగో ధైర్యం చేసి దాని కళ్లపై ఓ వస్త్రాన్ని కప్పారు. కొన్ని గంటల కసరత్తు అనంతరం మొసలిని అక్కడి నుంచి తరలించి పీఎల్ జీసీ అనే మరో కాలువలోకి విడిచిపెట్టారు. నీటిలోంచి బయటకు వచ్చిన దాన్ని ఆడ మొసలిగా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ తెలిపారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అరుదైన పామును పట్టుకున్నారు.. వీడియో వైరల్ చేసి బుక్ అయ్యారు
తాజ్ హోటల్లో వీధి కుక్క.. రతన్ టాటా ప్రేమకు నెటిజన్లు ఫిదా
ప్రభాస్ ఫ్యాన్స్‌కు దిమ్మతిరిగే న్యూస్.. రిలీజ్ కు రెడీగా కల్కి ట్రైలర్
సీరియల్ హీరోయిన్‌తో స్టార్ క్రికెటర్ పెళ్లి ?? ఇదిగో క్లారిటీ
Vijay Sethupathi: ఫ్యాన్‌కు స్వీట్ సర్‌ప్రైజ్ ఇచ్చిన స్టార్ హీరో
పరిహారంలోనూ పక్షపాతమేనా? రాజీవ్ రహదారి బాధితుల ఆవేదన !
ఏం..పిచ్చిపిచ్చిగా ఉందా?.. ట్రంప్ ఆంక్షలపై ఇరాన్ ఫైర్! తగ్గేదే లే
ముంచుకొస్తున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వానగండం..
వందేమాతరం గీతానికి అరుదైన గౌరవం!
భారత్‌కు టైఫూన్ 'డాల్ఫిన్' దెబ్బ..మన రుతుపవనాల పై ఎఫెక్ట్!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!

