సామాన్యులకు చిక్కనంటున్న చింతచిగురు.. @1000/-
ఆకు కూరలు ఆరోగ్యానికి చాలా మంచింది. కొంచెం చవకగా దొరుకుతాయి కూడా. కొన్ని సీజనల్ ఆకు కూరలు ఉంటాయి. అవి కాస్త ధర ఎక్కువగానే ఉంటాయి. అలాంటి వాటిలో చింతచిగురు ఒకటి. వసంతకాలంలో ఎక్కడ చూసినా ఎర్రని లేలేత చిగురుతో చింతచెట్లు దర్శనమిస్తాయి. ఈ కాలంలో గ్రామాల్లో చెట్టునుంచి నేరుగా తెంపికొని వివిధ రకాల కూరలతో కలిపి వండుకుంటారు.
ఎన్ని ఆకు కూరలు ఉన్నా చింతచిరుగు రుచే వేరు అన్నట్టు ఉంటుంది. ప్రతి కూరలో ఇమిడిపోయి ఆ కూరకు చక్కని రుచిని అందిస్తుంది. అందుకే సమ్మర్‌లో మాత్రమే దొరికే ఈ చింతచిరుగురుకి డిమాండ్ ఎక్కువ. అందుకే ఈ చింత చిగురు వినియోగదారుల గుండెలో చింతరేపుతోంది. అవును మరి ఏకంగా కిలో చింతచిగురు వెయ్యి రూపాయలు పలుకుతోంది. ఏకంగా మటన్ రేటును దాటి పరుగులు తీస్తోంది. పల్లెల్లో అంత ధర లేనప్పటికీ.. పట్టణాలు, సిటీల్లో మాత్రం చింత చిగురు ధర మండిపోతుంది. ఖమ్మం నగరంలో ఆదివారం కేజీ చింత చిగురు రూ.వెయ్యి పలికింది. మాములు రోజుల్లో కిలో చింతచిగురు రూ.400 నుంచి రూ.500 మధ్య ఉంటుంది. అయితే ఆదివారం మాత్రం రికార్డు రేంజ్‌లో రూ.వెయ్యి పలకడం గమనార్హం. వామ్మో అదే వెయ్యి రూపాయలు పెడితే.. కేజీ మటన్ వస్తుందిగా అంటూ చాలా మంది వెనక్కి వెెళ్లిపోయారు. చింత చెట్ల ఆకులు రాలిపోయాక, కొత్తగా చిగురులు తొడుగుతాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఈ లేలేత చింతచిగురును వంటల్లో విరివిగా వాడతారు. చిగురును పప్పులో వేయడంతో పాటు.. మాంసాహార వంటకాల్లో కూడా వేస్తారు. చింత చెట్టు కొమ్మ చివరి వరకు ఎక్కి, ప్రాణాలకు తెగించి చిగురు సేకరిస్తామని విక్రయ దారులు చెబుతున్నారు. సరైన వర్షాలు లేక చిగురు చాలా తక్కువగా దొరుకుతుందని.. అందుకే దీనికి అంత ధర అని అంటున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రేషన్ కార్డు దారులకు గుడ్‌న్యూస్.. జూన్ 1 నుంచి పండగే..!
సంతానం కలిగేలా చేస్తామన్నారు.. కట్‌చేస్తే..
వందేళ్లు సంపూర్ణ ఆరోగ్యంతో బతకాలంటే ?? డాక్టర్ సూచన..!
కడుపునొప్పితో ఆస్పత్రికి మహిళ.. టెస్టులు చేసిన డాక్టర్లకు షాక్..
ఇంటి బయట నిద్రించిన బాలుడు.. కాటేసిన కట్లపాము, రక్తపింజర.. చివరకు
ఏనుగు అరుపు వినందే.. ఆమెకు నిద్రపట్టదు !
ఆలయంలోని బావిలో అద్భుతం.. చూసి షాకైన గ్రామస్తులు
భూమ్మీద అత్యంత ప్రమాదకరమైన పాము..
భార్య వదిలి వెళ్లిపోయింది.. ‘AI జెమిని’ సలహా ఏంటంటే..
వేసవి వేడికి.. ఏసీ లేకుండానే ఇల్లంతా చల్లగా
ఇన్‌స్టా రీల్ చూసి ఉమ్మెత్త ఆకులు కూర చేసి తిన్నారు.. ఆ తర్వాత

