నల్ల నేరేడు కాదు..తెల్ల నేరేడు.. తింటే వదలరు..!
సాధారణంగా నేరేడు పండ్లు ఎలా ఉంటాయి? నలుపు నీలం కలిసిన రంగుతో ఆకర్షణీయంగా ఉంటాయి. సమ్మర్‌రో రోడ్డుపక్కన బండ్లపై నిగనిగలాడుతూ అందరినీ ఆకర్షిస్తాయి. కాస్త తీపి కాస్త వగరు రుచితో ఉండే నేరేడులో ఉండే ఔషధ గుణాల గురించి చెప్పనక్కర్లేదు. అయితే ఈ నేరేడు పండ్లలో తెల్ల నేరేడు పండ్లు కూడా ఉంటాయని తెలుసా.. వీటిని ఎప్పుడైనా చూశారా? నిజానికి ఇవి చాలా అరుదుగా దొరుకుతాయి.
ఆకారంలో నల్ల నేరేడుకు కాస్త భిన్నంగా ఉన్నప్పటికీ పోషకాలు అందించడంలో మాత్రం వాటికి మించినవి. ఆయుర్వేదంలో కూడా తెల్ల నేరేడు పండ్ల ప్రస్తావన ఉంది. వీటిని చాలా తక్కువ మంది పండిస్తుంటారు. ప్రస్తుతం ఈ తెల్లనేరేడు పండ్లు కాపు దశకు వచ్చి చెట్లపై కళకళ లాడుతున్నాయి. నల్ల నేరేడు కన్నా తెల్ల నేరేడు పండ్లలో అధిక ఔషధగుణాలు ఉంటాయట. మార్కెట్‌లో ఈ మొక్కలు దొరుకుతాయి. వీటి ధర వంద నుంచి రూ.150 వరకు దొరుకుతుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్న పుప్పాల వెంకట్రావు కు తూర్పుగోదావరి జిల్లా రావూరి పాడులో వ్యవసాయ భూమి ఉంది. అందులో వేసిన తెల్ల నేరేడు చెట్టుకు ఈ ఏడాది విపరీతంగా కాపు వచ్చింది. చెట్టు తొలికాపు కావటంతో ఆయన పండ్లను కోసి హైదరాబాద్ లోని తన స్నేహితులకు రుచి చూపించారు. ఏదైనా ప్రత్యేకంగా ఉంటే వాటి పట్ల ఆసక్తి ఉంటుంది అందులోనూ ఆరోగ్యప్రయోజనాలు ఉంటే ఖరీదైనా వినియోగం తప్పనిసరిగా మారుతుంది. ఇప్పటికే సాధారణ నేరేడులో హైబ్రిడ్ కాయలు వచ్చేశాయి. కమర్షియల్ క్రాప్ గాను కొందరు పెంచుతున్నారు. భవిష్యత్తులో ఈ స్ధానంలోకి తెల్లనేరేడు వచ్చి చేరే అవకాశం కూడా కనిపిస్తుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తండ్రికి మరిచిపోలేని గిఫ్ట్ ఇవ్వాలనుకుంది..చివరికి అంతులేని శోకం మిగిల్చింది !!
అర్థరాత్రి హీరోయిన్ గదిలోకి దూరిన దొంగ !! షాక్‌తో గట్టిగా అరిచిన ముద్దుగుమ్మ
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

