తండ్రికి మరిచిపోలేని గిఫ్ట్ ఇవ్వాలనుకుంది..చివరికి అంతులేని శోకం మిగిల్చింది !!
తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి భవిష్యత్తును ఇవ్వాలనుకుంటారు. అందుకు తామెంత కష్టపడినా పర్వాలేదనుకుంటారు. నిరంతరం తమ పిల్లల శ్రేయస్సు కోసం ఆరోగ్యం కూడా లెక్కచేయకుండా కష్టపడతారు. తమ కష్టం ఫలించి.. పిల్లలు ఉన్నత స్థితికి చేరుతుంటే వారి ఆనందానికి అవధులుండవు. పిల్లలు సైతం తమ తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి వారికి అండగా నిలవాలనుకుంటారు.
తమ ఎదుగుదల కోసం తపించిన తల్లిదండ్రులను సంతోషంగా చూసుకోవాలని అనుకుంటారు. తమ కోసం పేరెంట్స్ చేసిన త్యాగాలకు ప్రతిఫలంగా వారికి తిరిగి సంతోషాన్ని అందించాలని భావిస్తారు. అలా ఆలోచించిన ఓ యువతి తన తండ్రికి ఊహించని గిఫ్ట్ ఇచ్చి ఆయన కళ్లలో ఆనందం చూడాలనుకుంది. కానీ ఆమె కోరిక నెరవేరకుండానే ఆ తండ్రికి తీరని శోకాన్ని మిగిల్చి అనంతలోకాలకు వెళ్లిపోయింది. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం తందూరుకు చెందిన చేడె జనార్దన్‌కు కూతురు, కుమారుడు ఉన్నారు. వ్యవసాయం చేసుకుంటూ ఉన్నంతలో ఇద్దరు పిల్లలను చదివించాడు. బాగా చదువుకున్న పిల్లలు ఇప్పుడు ప్రయోజకులయ్యారు. కూతురు యశస్విని హైదరాబాద్ గచ్చిబౌలిలోని పీడబ్ల్యూసీ కంపెనీలో మూడేళ్లుగా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తోంది. తనను ఎంతో కష్టపడి చదివించి ప్రయోజకురాలిని చేసిన తండ్రికి మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకుంది. గ్రామంలో ఉండే తన తండ్రి బుల్లెట్ పై తిరుగుతుంటే చూడానుకుంది. ఇందుకోసం హైదరాబాద్‌లోని ఓ షోరూంలో బుల్లెట్ బైక్ ను కొనుగోలు చేసింది. బుల్లెట్ ను తండ్రికి ఇచ్చేందుకు తన సహోద్యోగి అచ్యుత్ కుమార్ తో కలిసి అదే బుల్లెట్ బైక్ పై తమ స్వగ్రామమైన తందూరుకు బయలుదేరింది. ఈ క్రమంలో సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాముల శివారులోకి రాగానే హైవేపై పడి ఉన్న గేదె కళేబరాన్ని ఢీకొట్టి వాళ్లు ప్రయానిస్తున్న బైక్ కిందపడిపోయింది. దీంతో బైక్ పై ఉన్న యశస్విని ఎగిరి రోడ్డుపై పడింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అర్థరాత్రి హీరోయిన్ గదిలోకి దూరిన దొంగ !! షాక్‌తో గట్టిగా అరిచిన ముద్దుగుమ్మ
దుర్గమ్మ భక్తులకు అలర్ట్..ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్ మూసివేత!
వడదెబ్బ ధాటికి ఒక్కరోజే 23 మంది బలి..ఏపీలో పిడుగులతో కూడిన వర్షం
మన ఆర్థికవ్యవస్థకు..3 భయంకరమైన సవాళ్లు.. ఏమిటవి?
అనాథాశ్రమంలో ఉండే యువతులతో పెళ్లంటే ఎగిరి గంతేసిన యువకులు
బార్లో బీరు సీసాలతో రచ్చ.. తల పగిలినా కూల్‌గా 'లాస్ట్ పెగ్' వేసి
ఉద్యోగం పోయిందని సంబరాలు..
మృత్యువు ఇలా కూడా వస్తుందా..! భోజనం చేస్తుండగానే

