Reels on Road: రీల్స్‌ కోసం ఢిల్లీ యువకుడి పిచ్చి చేష్టలు

|

Apr 29, 2024 | 10:48 PM

రీల్స్‌తో పాపులర్ అయ్యేందుకు కొందరు సామాన్యుల్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. సోషల్ మీడియాలో వ్యూయర్‌షిప్‌ కోసం ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. ఢిల్లీకి చెందిన ఓ యువకుడు సైతం ఇలానే రీల్స్ కోసం ప్రయత్నించి అడ్డంగా బుక్కయ్యాడు. విపిన్ కుమార్ అనే 26 ఏళ్ల యువకుడు నిత్యం రద్దీగా ఉండే ఢిల్లీలోని జీటీ కర్నాల్ రోడ్డుపై బండిని అడ్డంగా పార్క్ చేశాడు. అంతటితో ఆగకుండా రోడ్డుపై ఏకంగా కుర్చీ వేసుకొని కూర్చున్నాడు. నల్ల కళ్లద్దాలు పెట్టుకొని కాలు మీద కాలు వేసుకొని పోజు కొట్టాడు. దీంతో ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వీడియోను చూసిన ఢిల్లీ పోలీసులు అతనికి బేడీలు తొడిగారు. నిబంధనలను ఉల్లంఘించినందుకు వెంటనే అతన్ని అరెస్టు చేశారు. మోటారు వాహనాల చట్టంలోని వివిధ సెక్షన్ల కింద ఆ యువకుడిపై కేసు నమోదు చేశారు. ఇండియన్ పీనల్ కోడ్ లోని సెక్షన్లను కూడా వర్తింపజేసినట్లు మీడియాకు తెలిపారు. అతన్ని అరెస్టు చేయడంతోపాటు బైక్, మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నామనీ అతని ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ను తొలగించే ప్రక్రియ కొనసాగుతోందని ఢిల్లీ పోలీసులు ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.