పదేళ్ల ప్రార్థనల ఫలం.. ఆ చిన్నారి ఆరు నెలలకే అనంత లోకాలకు

Updated on: Jan 06, 2026 | 12:40 PM

ఇండోర్‌లోని మరాఠీ మొహల్లాలో కలుషిత మున్సిపల్ నీటి సరఫరా కారణంగా తీవ్ర విషాదం చోటుచేసుకుంది. 6 నెలల పసికందుతో సహా 8 మంది మరణించగా, 149 మంది ఆసుపత్రి పాలయ్యారు. తాగే నీరు కలుషితమై ప్రాణాలు కోల్పోతుండటంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యమే కారణమని సీఎం విచారణకు ఆదేశించి, ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. మున్సిపల్ వ్యవస్థ పనితీరుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

సాధన సాహు అనే మహిళకు వివాహమైన పదేళ్ల వరకు సంతానం కలగలేదు. ఎన్నో గుళ్లు, గోపురాలు తిరిగి ప్రార్థనలు చేసిన తర్వాత ఆరు నెలల క్రితమే ఆమెకు కుమారుడు జన్మించాడు. అయితే ఇంటికి సరఫరా అయిన మున్సిపల్ వాటర్ కలుషితం కావడంతో ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. తాగే పాలలో కలుషిత నీళ్లు కలపడంతో ఆ పసివాడికి తీవ్రమైన వాంతులు, విరేచనాలయ్యాయి. వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి, ఆపై ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినప్పటికీ.. ఫలితం లేకపోయింది. డాక్టర్లు ఆ చిన్నారి మరణించినట్లు ప్రకటించారు. “నా బిడ్డ వెళ్లిపోయాడు. అధికారుల పాపం నా పసివాడిని బలి తీసుకుంది” అంటూ ఆ తల్లి విలపిస్తున్న తీరు హృదయవిదారకంగా ఉంది. ఒక్క ఆ చిన్నారి మాత్రమే కాదు ఈ ప్రాంతంలో కలుషిత నీటి ప్రభావం తీవ్రంగా ఉంది. మధ్య ప్రదేశ్‌ రాష్ట్రం ఇండోర్ లోని మరాఠీ మొహల్లాలో నీటి సంబంధిత వ్యాధులతో ఎనిమిది మంది మరణించారు. 27 ఆసుపత్రుల్లో దాదాపు 149 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. గత కొన్ని రోజులుగా కుళాయిల ద్వారా ‘కాలువ నీరు’ లాంటి మురికి నీరు వస్తోందని.. మున్సిపల్ అధికారులకు మొత్తుకున్నా ఎవరూ పట్టించుకోలేదని స్థానికులు ఆరోపించారు. ఈ ఘటన కలకలం సృష్టించడంతో ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేసారు విచారణకు ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ప్రస్తుతం యుద్ధప్రాతిపదికన క్లోరినేషన్ పనులు చేస్తున్నారు. ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నారు. ప్రజలు తాగే నీరు కలుషితమై ప్రాణాలు పోతుంటే మున్సిపల్‌ వ్యవస్థ ఎందుకు పని చేయడం లేదన్న ప్రశ్న వినిపిస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Gold Price Today: బంగారం,వెండి ధరలకు రెక్కలు.. సోమవారం తులం ఎంతంటే

Faima: బాయ్‌ ఫ్రెండ్‌కు జబర్దస్థ్‌ ఫైమా స్వీట్ బర్త్‌ డే సర్‌ప్రైజ్‌

Akhanda 2: OTTలోకి అఖండ2… డేట్ ఫిక్స్ ?

బట్టలు లేకుండా టాలీవుడ్ నటుడు.. షాకింగ్‌గా ‘దిల్ దియా’ ఫస్ట్ లుక్

Allu Arjun: బన్నీ థియేటర్‌ బన్ గయా..! దేశంలోనే అతి పెద్ద డాల్బీ స్క్రీన్‌.. సంక్రాంతికి ఓపెన్