Tigers Carcasses: అడవిలో పులుల మృతదేహాలు.. అసలేం జరిగింది.?

|

Sep 09, 2023 | 4:59 PM

బల్లార్షా అటవీ ప్రాంతంలో పులులు మృతదేహాలు కలకలం రేపాయి. సెప్టెంబర్‌ 7న ఫారెస్ట్‌ గార్డులు ఈ మృతకళేబరాలను గుర్తించారు. తూర్పు మహారాష్ట్రలోని చంద్రాపూర్‌ జిల్లా సెంట్రల్‌ చందా డివిజన్‌లోని అటవీ ప్రాంతంలో ఈ మృతకళేబరాలు కనిపించగా... అక్కడికి కిలోమీటరు దూరంలో మరో పులిపిల్ల నీరసించి ప్రాణాలు కోల్పోయే స్థితిలో కనిపించింది. వెంటనే అలర్టయిన గార్డ్‌లు‌ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు.

బల్లార్షా అటవీ ప్రాంతంలో పులులు మృతదేహాలు కలకలం రేపాయి. సెప్టెంబర్‌ 7న ఫారెస్ట్‌ గార్డులు ఈ మృతకళేబరాలను గుర్తించారు. తూర్పు మహారాష్ట్రలోని చంద్రాపూర్‌ జిల్లా సెంట్రల్‌ చందా డివిజన్‌లోని అటవీ ప్రాంతంలో ఈ మృతకళేబరాలు కనిపించగా… అక్కడికి కిలోమీటరు దూరంలో మరో పులిపిల్ల నీరసించి ప్రాణాలు కోల్పోయే స్థితిలో కనిపించింది. వెంటనే అలర్టయిన గార్డ్‌లు‌ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి‌ దిగిన బల్లార్షా అటవీ రేంజ్ అధికారిణి శ్వేత.. తల్లి‌పులి జాడ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నీరసించిన పులి పిల్లను రెస్క్యూ చేసి సమీపంలో తడోబా ట్రాన్సిట్ ట్రీట్‌మెంట్ సెంటర్‌కు తరలించారు. ఐదు నెలల ‌వయసున్న ఆడపులి‌పిల్లగా గుర్తించిన అధికారులు.. దాని‌ రక్షణ చర్యలు చేపట్టారు. చనిపోయిన రెండు పులి పిల్లల్లో ఒకటి నాలుగు నెలలు , మరొకటి ఐదు‌నెలలు ఉన్నట్టుగా గుర్తించారు. రెండూ మగ పులి పిల్లలుగా గుర్తించారు.

జాతీయ రహదారి 253/B సమీపంలోని కలమన బీట్‌లో మృతదేహాలు లభ్యమయ్యాయని తెలిపారు‌‌ ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ శ్వేత తెలిపారు. పులి బహుశా వేటకు వెళ్లి ఉండవచ్చు లేదా అడవిలో తప్పిపోయి ఉండవచ్చునని, ఆ కారణంగానే ఒంటరైన పులి‌పిల్లలు ఆకలితో అలమటించి చనిపోయి ఉండవచ్చని‌ తెలిపారు. పోస్టుమార్టం నిర్వహించామని తుది నివేదిక‌ వచ్చాక పులి పిల్లలు ఎలా మృతి‌ చెందాయో తెలిసే అవకాశం ఉందన్నారు ఫారెస్ట్ అధికారులు. తప్పిపోయిన తల్లి పులిని గుర్తించేందుకు ఐదు బృందాలను రంగంలోకి‌ దింపామన్నారు. తల్లి‌పులి కోసం 24 గంటలుగా పారెస్డ్ గార్డ్స్, స్పెషల్ పారెస్ట్ పోర్స్ , టైగర్ ట్రాకర్స్ రంగంలోకి దిగి సర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. పాద ముద్రల ఆధారంగా పులిని కనిపెట్టే పనిలో పడ్డారు. ప్రస్తుతం కాపాడిన పులి పిల్ల ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..