Srikalahasti: శ్రీకాళహస్తిలో మరో వివాదం.. రాత్రికి రాత్రి భరద్వాజేశ్వరాలయ సమీపంలో ప్రత్యేక్షం అయినా సమాధి(వీడియో)
శ్రీకాళహస్తిలో మరో వివాదం నెలకొంది..మృతదేహాన్ని రాత్రి సమయంలో తెచ్చి ఖననం చేసి వెళ్ళారు కొందరు వ్యక్తులు..అది కూడా.. ఆలయానికి అనుబంధంగా ఉన్న భరద్వాజేశ్వరాలయం దగ్గరేక సమాధి చేశారు....ఇంతకీ ఆ మృతదేహాం ఎవరిది...
శ్రీకాళహస్తిలో మరో వివాదం నెలకొంది..మృతదేహాన్ని రాత్రి సమయంలో తెచ్చి ఖననం చేసి వెళ్ళారు కొందరు వ్యక్తులు..అది కూడా.. ఆలయానికి అనుబంధంగా ఉన్న భరద్వాజేశ్వరాలయం దగ్గరేక సమాధి చేశారు….ఇంతకీ ఆ మృతదేహాం ఎవరిది..ఇక్కడే ఎందుకు పూడ్చారు…కనీసం ఆధికారులకు సైతం తెలియక పోవడంతో ఈ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
శ్రీకాళహస్తి ఆలయానికి అనుబంధంగా ఉన్న భరద్వాజేశ్వరాలయం వద్ద వ్యక్తిని ఖననం చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. నెల్లూరు జిల్లా నాయుడుపేటకు చెందిన వ్యక్తి మృతదేహాన్ని సెప్టెంబర్ 13న రాత్రి ఏడు గంటల సమయంలో ఇక్కడకు తీసుకువచ్చి ఆలయం పక్కన గోతులు తవ్వి ఖననం చేశారు. ఆ వ్యక్తి ఎవరు..? నాయుడుపేట నుంచి ఇక్కడకు తీసుకురావాల్సిన అవసరం ఏముంది..? అయినా భరద్వాజేశ్వరాలయం పక్కనే సమాధి చేయడం ఎంత వరకు సమంజసం..? స్థానికేతర వ్యక్తికి ఎవరు అనుమతి ఇచ్చారనేది సమాధానం లేని ప్రశ్నలుగా మిగిలిపోయాయి.
భరద్వాజ మహర్షి తపస్సు చేసిన దివ్య ప్రదేశంగా ఇక్కడి ప్రాంతం పవిత్రతను సంతరించుకుంది. ఏళ్ల క్రితం ఇక్కడే ఉంటూ భగవంతుని సేవించుకుంటూ అవధూతలుగా ఉంటున్న భక్తులను ఇక్కడ సమాధి చేశారు. అది జరిగింది కూడా ఏళ్ల క్రితం. అయితే ప్రస్తుతం బయటి వ్యక్తుల మృతదేహాలను ఇక్కడ ఖననం చేసేందుకు వీలు కాదు. ఎక్కడో నాయుడుపేటకు చెందిన వ్యక్తి గతంలో ఇక్కడ అవధూతగా ఉంటూ వచ్చిన కోట్లమ్మ శిష్యుడని చెప్పి ఇక్కడకు తీసుకువచ్చి ఖననం చేయడం విమర్శలకు కారణం అవుతోంది. ఈ విషయమై స్థానిక ప్రజాప్రతినిధి ఇక్కడి అధికారులతో చర్చించినట్లు సమాచారం.
మరిన్ని చదవండి ఇక్కడ : శివాలయంలో నాగుపాము హల్ చల్.. ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు..(వీడియో): Snake Viral Video.
నిర్మల్ జిల్లా సిర్పేల్లి తాండలో చిన్నారుల సందడి.. వైరల్ అవుతున్న వీడియో: Childrens viral video.