నిర్మల్ జిల్లా సిర్పేల్లి తాండలో చిన్నారుల సందడి.. వైరల్ అవుతున్న వీడియో: Childrens viral video.
గణేష్ నిమజ్జన శోభాయాత్రలో డిజే లకు పర్మిషన్ లేకపోవడంతో బ్యాండ్ కు డిమాండ్ పెరిగింది. అయితే ఆ చిన్నారులకు వినాయక నిమజ్జనానికి బ్యాండ్ కూడా దొరకకపోవడంతో అదిరేటి ఐడియాతో తమ గణపతికి వీడ్కోలు పలికారు చిన్నారులు.
గణేష్ నిమజ్జన శోభాయాత్రలో డిజే లకు పర్మిషన్ లేకపోవడంతో బ్యాండ్ కు డిమాండ్ పెరిగింది. అయితే ఆ చిన్నారులకు వినాయక నిమజ్జనానికి బ్యాండ్ కూడా దొరకకపోవడంతో అదిరేటి ఐడియాతో తమ గణపతికి వీడ్కోలు పలికారు చిన్నారులు. ఖాళీ డబ్బాలతో బ్యాండ్ వాయిస్తూ సందడి చేశారు. బ్రాస్ బ్యాండ్ ట్రూప్ స్థాయిలో ఖాళీ డబ్బాలను వాయిస్తూ పలువురిని ఆకట్టుకున్నారు. ఇది నిర్మల్ జిల్లా కుభీర్ మండలం సిర్పేల్లి తాండలో జరిగింది. ఖాళీ డబ్బాలతో బ్యాండ్ ల కొట్టుకుంటూ డ్యాన్సులు చేశారు చిన్నారులు. ఎడ్ల బండి పై గణేశుడికి వీడ్కోలు పలికి మరింత ఆకర్షణగా నిలిచారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్‌లో సందడి చేస్తోంది..
మరిన్ని చదవండి ఇక్కడ : రాజు డెత్ పై సీతక్క స్పందన: ప్రజా పోరాటాల వల్ల రాజు చచ్చాడు..(వీడియో): Seethakka Video.
వైరల్ వీడియోలు
Latest Videos