క్రిమినల్‌ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా

Updated on: Jan 19, 2026 | 9:35 PM

కడప జిల్లా బద్వేల్ న్యాయవాది ప్రసాద్ సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి రూ.72 లక్షలు పోగొట్టుకున్నారు. సీబీఐ అధికారులమని నమ్మించి, మహిళల అక్రమ రవాణా కేసు పేరుతో బెదిరించి డిజిటల్ చెల్లింపులు చేయించుకున్నారు. 40 ఏళ్ల అనుభవం ఉన్న లాయర్ కూడా మోసపోవడం ఈ సైబర్ నేరాల తీవ్రతను, అప్రమత్తత ఆవశ్యకతను తెలియజేస్తోంది. పోలీసులు ప్రధాన నిందితుడిని గుర్తించారు.

క్రిమినల్‌ లాయర్‌కే కుచ్చు టోపీ పెట్టారు సైబర్‌ నేరగాళ్లు. సెక్షన్లు తెలిసిన వ్యక్తి.. లా గురించి పూర్తిస్థాయిలో అవగాహన ఉన్న వ్యక్తి… అయినా సరే కేటుగాళ్ళు చెప్పిన సెక్షన్లు అర్థం కాక వాళ్ళ ఉచ్చులో పడిపోయాడు. తీరా తేరుకునే లోపే 72 లక్షలు లాగేసారు. కడప జిల్లా బద్వేల్ నగరంలోని క్రిమినల్ లాయర్ గా ఉన్న ప్రసాద్ అనే వ్యక్తి 40 సంవత్సరాలుగా లాయర్ వృత్తిలో ఉన్నారు. 2025 సెప్టెంబర్ లో అతనికి ఒక డిజిటల్‌ కాల్‌ వచ్చింది. మీరు ఉమెన్ ట్రాఫికింగ్ కేసులో ఉన్నారని మా దగ్గర ఆధారాలు ఉన్నాయని మీ ఆధార్ నెంబరు ద్వారా మిమ్ములను ట్రేస్ చేశామని బెదిరించారు. దాదాపు మూడు గంటలపాటు వారితో డిస్కషన్ చేసిన తర్వాత మేము సిబిఐ వారమని మాకు కేసుకు సంబంధించి డిజిటల్ పేమెంట్ చేయాలని దాని ద్వారా కేసు పూర్వపరాలను చర్చించిన తర్వాత మీరు నిర్దోషిగా తెలితే ఆ సొమ్మును రిఫండ్ చేస్తామని తెలపడంతో..లాయర్ వారికి అడిగినంత, అడిగినప్పుడల్లా సమర్పించుకున్నారు. 7 దఫాలుగా 72 లక్షల రూపాయలను కేటుగాళ్లు కొట్టేశారు. మూడు నెలల తర్వాత విషయం అర్ధమైన లాయర్‌ ప్రసాద్ బద్వేల్ పోలీసులను ఆశ్రయించారు . వారు ఈ కేసును సైబర్ క్రైమ్ పోలీసులకు అప్పజెప్పారు. రంగంలోకి దిగిన సైబర్‌ క్రైమ్‌ పోలీసులు హద్దద్‌ కోయ అనే వ్యక్తిని ఈ క్రైమ్‌లో ప్రధాన సూత్రధారిగా గుర్తించారు. ఇతని పేరుమీద దాదాపు 22 కోట్ల రూపాయల వరకు ట్రాన్సాక్షన్ జరిగినట్లు కడప పోలీసులు తేల్చారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Gold Price Today: ట్రంప్‌ ఎఫెక్ట్‌.. భారీగా పెరిగిన బంగారం, వెండిధరలు!

వణుకు పుట్టిస్తున్న పొగమంచు.. హైవేపై హెవీ ట్రాఫిక్‌ జామ్‌

గొర్రె రక్తానికి అంత పవర్ ఉందా.. అసలు నిజాలు తెలిస్తే షాకవుతారు

ఎండు చేపలను ఇష్టంగా తింటున్నారా.. డేంజర్‌ సుమా

Deepika Padukone: 40 ఏళ్లలో ఫిట్‌గా దీపిక.. రోజూ భోజనంలో ఇవి ఉండాల్సిందే