iPhone 15: ఐఫోన్ 15 సిరీస్ కోసం బారులు తీరిన కస్టమర్లు.. వీడియో వైరల్.

iPhone 15: ఐఫోన్ 15 సిరీస్ కోసం బారులు తీరిన కస్టమర్లు.. వీడియో వైరల్.

Anil kumar poka

|

Updated on: Sep 24, 2023 | 9:31 AM

మొబైల్స్‌లో ఐ ఫోన్‌కి ఉన్న క్రేజే వేరు. భద్రతా ఫీచర్లకు పెద్దపీట వేస్తూ అధునాతన స్పెసిఫికేషన్స్‌తో వచ్చే యాపిల్‌ ఫోన్స్‌ను అందరూ ఇష్టపడుతుంటారు. ధర అధికంగా ఉన్నా యాపిల్‌ ఫోన్స్‌ను కొంటూ ఉంటారు. యాపిల్‌ ఫోన్‌ ఉండడమే ఓ హోదాగా ఫీలవుతారు. కస్టమర్ల నుంచి వచ్చే స్పందనకు అనుగుణంగానే యాపిల్‌ కంపెనీ కూడా ఎప్పటికప్పుడు తన ఫోన్‌ను అప్‌గ్రేడ్‌ చేస్తూ కొత్త సిరీస్‌ ఫోన్స్‌ను రిలీజ్‌ చేస్తూ ఉంటుంది.

మొబైల్స్‌లో ఐ ఫోన్‌కి ఉన్న క్రేజే వేరు. భద్రతా ఫీచర్లకు పెద్దపీట వేస్తూ అధునాతన స్పెసిఫికేషన్స్‌తో వచ్చే యాపిల్‌ ఫోన్స్‌ను అందరూ ఇష్టపడుతుంటారు. ధర అధికంగా ఉన్నా యాపిల్‌ ఫోన్స్‌ను కొంటూ ఉంటారు. యాపిల్‌ ఫోన్‌ ఉండడమే ఓ హోదాగా ఫీలవుతారు. కస్టమర్ల నుంచి వచ్చే స్పందనకు అనుగుణంగానే యాపిల్‌ కంపెనీ కూడా ఎప్పటికప్పుడు తన ఫోన్‌ను అప్‌గ్రేడ్‌ చేస్తూ కొత్త సిరీస్‌ ఫోన్స్‌ను రిలీజ్‌ చేస్తూ ఉంటుంది. తాజాగా ఐఫోన్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 15 సిరీస్ సేల్ ప్రారంభమయ్యాయి. యాపిల్ స్టోర్స్ ఓపెన్ చేయకముందే కొనుగోలుదారులు షాపుల ముందు బారులుతీరారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  ఢిల్లీ, ముంబై నగరాల్లో యాపిల్ స్టోర్ల ప్రారంభోత్సవం తర్వాత ఐఫోన్ లాంచ్ కావడం ఇదే మొదటిసారి. ఉదయం 8 గంటలకు స్టోర్ ప్రారంభమైంది. కస్టమర్లను బ్యాచ్‌ల వారీగా ఆహ్వానిస్తున్నారు. చాలామంది కస్టమర్లు ఉదయం 3 గంటల నుంచే ఎదురు చూస్తున్నట్లు సమాచారం. యాపిల్ కంపెనీ ఇటీవలే ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మాక్స్ అనే మోడల్స్ లాంచ్ చేసింది. వీటి ధరలు కస్టమర్‌ ఎంచుకునే స్టోరేజ్ కెపాసిటీని బట్టి ఉంటుంది. ఇవి మొత్తం ఐదు కలర్స్‌లో లభిస్తాయి. కొత్త ఐఫోన్ 15 ప్రో, ప్రో మ్యాక్స్ మోడల్స్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డ్‌లను ఉపయోగించడం ద్వారా 6000 రూపాయల వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఇతర మోడల్స్ మీద 5000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. కొత్త మోడల్స్ మీద మాత్రమే కాకుండా ఐఫోన్ 14, 13 సిరీస్‌ల మీద కూడా 4000 నుంచి 3000 వరకూ తగ్గింపు లభిస్తుంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..