crocodile with monkeys video: కోతులా.. మజాకా.. మొసళ్లకు చుక్కలు చూపించాయిగా.!(వీడియో)

crocodile with monkeys video: కోతులా.. మజాకా.. మొసళ్లకు చుక్కలు చూపించాయిగా.!(వీడియో)

Anil kumar poka

|

Updated on: Feb 03, 2022 | 10:00 PM

Monkey Viral Video: డ్యాన్స్‌కి సంబంధించిన చాలా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వీడియోలలో కొన్ని చాలా ఫన్నీగా ఉంటాయి. వీటిలో కొన్ని వీడియోలను మళ్లీ మళ్లీ చూసేందుకు ఇష్టపడుతుంటారు. ఈ రోజుల్లో కూడా...



డ్యాన్స్‌కి సంబంధించిన చాలా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వీడియోలలో కొన్ని చాలా ఫన్నీగా ఉంటాయి. వీటిలో కొన్ని వీడియోలను మళ్లీ మళ్లీ చూసేందుకు ఇష్టపడుతుంటారు. ఈ రోజుల్లో కూడా అలాంటిదే ఒకటి తెరపైకి వచ్చింది. ఇది మీరు కూడా చూసి ఆశ్చర్యపోతారు. మొసళ్లు చాలా ప్రమాదకరమైన జంతువులని మనకు తెలిసిందే. ఇక కోతుల విషయానికి వస్తే అవి ఎగురుతూ, భయపెడుతూ, ఎక్కడ ఉన్నా సందడిచేస్తుంటాయి. కోతులు చేసే రచ్చకు అంతే ఉండదు. ఒక్కోసారి ఎంతో చిరాకును తెప్పిస్తుంటాయి. అలాగే కొన్నిసార్లు చాలా ఫన్నీగా అనిపిస్తుంటాయి. అయితే ప్రస్తుతం కోతులు, మొసళ్లకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇది చూస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోకుండా ఉండరు. ఒక మనిషి లేదా జంతువు మొసళ్ల మధ్యలో చిక్కుకుంటే, ఏం జరుగుతుందో మనకు తెలసిందే. దీన్ని తలచుకుంటేనే మన మనసులో భయం పుడుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో మాత్రం, కోతులు మొసళ్లను ఓ ఆట ఆడుకున్నాయి.

ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ వీడియోలో కోతుల గుంపు మొసలిపైకి పరుగెత్తడాన్ని మనం చూడొచ్చు. ఈ సమయంలో, చాలా సార్లు మొసళ్ళు కూడా కోతులను తమ ఆహారంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తాయి. కానీ కోతులు వాటి చేతుల్లోకి చిక్కుకోకుండా గెంతుతూ వాటిని ఆటపట్టిస్తుంటాయి.కోతుల ఈ ఫీట్ చాలా ఆశ్చర్యంగా ఉండడంతో ఈ వీడియోను చూస్తున్న చాలా మంది వినియోగదారులు ఆశ్చర్యపోయారు. ‘ఈ దృశ్యాన్ని చూసి నేను ఆశ్చర్యపోయాను’ అని ఒక నెటిజన్ కామెంట్ చేయగా, ‘అందరూ స్నేహితులుగా ఉంటారని నేను అనుకుంటున్నాను, కాబట్టి మొసళ్ళు ఏమీ చేయడం లేదు’ అంటూ మరొక నెటిజన్ కామెంట్ చేశాడు.

Published on: Feb 03, 2022 08:34 PM