Crocodile on Walking Track: వాకింగ్‌ ట్రాక్‌పై మొసలి..కాస్త చూసుకు వెళ్లండి..! దారి ఇచ్చిన నెటిజన్లు.. వీడియో వైరల్..

Updated on: Nov 03, 2021 | 9:28 AM

గుంటూరు జిల్లాలో మొసలి కలకలం రేపింది. పిడుగురాళ్ల మండలం పిడుగురాళ్లలో ఓ మొసలి జనసంచారం ఉండే ప్రదేశంలో ప్రత్యక్షమైంది. మొసలిని చూసిన స్థానికులు భయంతో పరుగులు తీశారు.


గుంటూరు జిల్లాలో మొసలి కలకలం రేపింది. పిడుగురాళ్ల మండలం పిడుగురాళ్లలో ఓ మొసలి జనసంచారం ఉండే ప్రదేశంలో ప్రత్యక్షమైంది. మొసలిని చూసిన స్థానికులు భయంతో పరుగులు తీశారు. పిడుగురాళ్లలోని వాటర్ ట్యాంక్ సమీపంలో గల పెదచెరువులోని సంచరిస్తున్న మొసలి..చెరువు చుట్టూ ఏర్పాటు చేసిన వాకింగ్‌ ట్రాక్‌పైకి వచ్చి చేరింది. చీకట్లో రోడ్డు పక్కన మాటువేసి ఉన్న మొసలిని స్థానికులు గుర్తించారు. వెంటనే అటవీ అధికారులకు సమాచారం అందించారు. చెరువులో సంచరిస్తున్న మొసళ్లను బంధించి వేరే ప్రాంతానికి తరలించాలని స్థానిక ప్రజలు అధికారులను కోరుతున్నారు.

మరిన్ని చదవండి ఇక్కడ: Unstoppable With NBK: అనిపించింది అందాం.. అనుకుంది చేద్దాం.. ఎవడాపుతాడో చూద్దాం.. దుమ్ములేపిన బాలయ్య..(ట్రేండింగ్ ఫొటోస్)