Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: మండుటెండలో తండ్రిని కంటికి రెప్పలా కాపాడుకున్న చిన్నారి..! నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..

Viral Video: మండుటెండలో తండ్రిని కంటికి రెప్పలా కాపాడుకున్న చిన్నారి..! నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..

Anil kumar poka

|

Updated on: Nov 03, 2021 | 9:23 AM

తండ్రి ఆలనా, పాలనలో ఆనందంగా పెరగాల్సిన ఓ చిన్నారి తండ్రికే అండగా నిలిచాడు. మండుటెండను సైతం లెక్కచేయకుండా తన తండ్రిని కంటికి రెప్పలా కాపాడుకున్నాడు. మద్యం మత్తులో ఉన్న తండ్రిని గంటల తరబడి ఆ బాలుడు మండుటెండలో తన కాళ్ళపై పడుకోబెట్టుకుని తండ్రి పట్ల...


తండ్రి ఆలనా, పాలనలో ఆనందంగా పెరగాల్సిన ఓ చిన్నారి తండ్రికే అండగా నిలిచాడు. మండుటెండను సైతం లెక్కచేయకుండా తన తండ్రిని కంటికి రెప్పలా కాపాడుకున్నాడు. మద్యం మత్తులో ఉన్న తండ్రిని గంటల తరబడి ఆ బాలుడు మండుటెండలో తన కాళ్ళపై పడుకోబెట్టుకుని తండ్రి పట్ల ప్రేమను చాటుకున్నాడు. తండ్రి పై ఆధారపడే పసి వయస్సులో.. ఆ చిన్నారి తన తాగుబోతు తండ్రికి స్పృహ వచ్చేంత వరకు కంటికి రెప్పలా కాపాడుకున్నాడు. జడ్చర్లలో జరిగిన ఈ ఘటనను‌ చూసిన స్థానికులు ఫిదా అయిపోయారు. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి మద్యం మత్తులో పడి ఓ స్పృహ కోల్పోయాడు. అది గమనించిన అతని కుమారుడు తండ్రి ఇబ్బందులకు గురి కాకుండా రోడ్డు పక్కనే మండుటెండలో చీమలు కుడుతున్నా లెక్కచేయకుండా గంటల తరబడి తన కాళ్ళపై పడుకోబెట్టుకున్నాడు. తండ్రికి స్పృహ వచ్చేంత వరకు కంటిరెప్పలా చూసుకున్నాడు.

జడ్చర్ల మండలం కొత్త తండా కు చెందిన మన్య నాయక్ తన బైక్ రిపేర్ కోసం కొడుకు హరీష్ తో కలసి వచ్చాడు. మన్యానాయక్ పూటుగా మద్యం సేవించి‌ స్పృహ కోల్పోయాడు. నిలబడే ఓపిక కూడా లేనంతగా తాగేశాడు. తూలుతున్న తన తండ్రిని చూసి ఏమి చేయలేక ఆ చిన్నారి మండుటెండలో చీమలు కుడుతున్నా లెక్కచేయకుండా గంటల తరబడి తన కాళ్ళపై పడుకోబెట్టుకున్నాడు. తండ్రికి స్పృహ వచ్చేంత వరకు కంటిరెప్పలా చూసుకున్నాడు. మద్యం మత్తు దిగాక.. ఇద్దరు ఇంటి బాట పట్టారు. ఇలా తండ్రిని రక్షించుకున్న తనయుడుని చూసి పలువురు ముక్కున వేలేసుకున్నారు. మరికొంతమంది చిన్నారి పట్ల జాలిని చూపారు.. తాగు బోతు తండ్రికి హితబోధ చేశారు.

మరిన్ని చదవండి ఇక్కడ: Unstoppable With NBK: అనిపించింది అందాం.. అనుకుంది చేద్దాం.. ఎవడాపుతాడో చూద్దాం.. దుమ్ములేపిన బాలయ్య..(ట్రేండింగ్ ఫొటోస్)