ఉద్యోగి మనసు చెదిరింది.. రాజీనామాల సునామీ మొదలైంది.. వీడియో

కరోనా ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగులకు కొత్త విషయాలు నేర్పింది. సంస్థల్లో ఏళ్ల తరబడి నమ్మకంగా పని చేసినా కూడా కష్టకాలంలో యాజమాన్యాలు పట్టించుకోకపోవడం వారి మనసును గాయపర్చింది.

ఉద్యోగి మనసు చెదిరింది.. రాజీనామాల సునామీ మొదలైంది.. వీడియో

|

Updated on: Oct 20, 2021 | 9:56 AM

కరోనా ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగులకు కొత్త విషయాలు నేర్పింది. సంస్థల్లో ఏళ్ల తరబడి నమ్మకంగా పని చేసినా కూడా కష్టకాలంలో యాజమాన్యాలు పట్టించుకోకపోవడం వారి మనసును గాయపర్చింది. సుదీర్ఘమైన షిఫ్టులు.. లే ఆఫ్‌లు.. వేతన కోతలతో తమను కంపెనీలు ఎక్కువగా వాడుకుంటున్నాయన్న భావన ఉద్యోగుల్లో బలంగా ఉండిపోయింది. ఇప్పుడు కరోనా వ్యాప్తి తగ్గింది. కంపెనీలు ఆకర్షణీయ వేతనాలు, ప్యాకేజీలు ఇస్తామన్నా ఉద్యోగులు ఉండటం లేదు. రాజీనామా చేసి కొత్త మార్గం వెతుక్కునే పనిలో పడ్డారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా అగ్రదేశాల్లో ‘ది గ్రేట్‌ రెజిగ్నేషన్‌’ సంక్షోభం మొదలైంది. ఒక్క అమెరికాలోనే ఆగస్టులో 43 లక్షల మంది తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారు. ఈ విషయాన్ని అమెరికాలో లేబర్‌ డిపార్ట్‌మెంట్‌ డేటా చెబుతోంది. ఈ ఉద్యోగుల రాజీనామాల పరంపర అన్ని రంగాల్లోనూ కనిపిస్తోంది.

 

మరిన్ని ఇక్కడ చూడండి: పిల్లిని కాపాడిన రైల్వే ఉద్యోగి.. ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు.. వీడియో

కోపాన్ని కొంటే అసిడిటీ ఫ్రీ! పారిశ్రామికవేత్త హర్ష్‌ గోయెంకా పాఠాలు.. వీడియో

Follow us