Underwater Metro: అండర్‌ వాటర్‌ మెట్రో.. క్యూ కట్టిన ప్రయాణికులు.. వీడియో.

|

Mar 18, 2024 | 3:36 PM

దేశంలోనే మొట్టమొదటి నదీ గర్భ మెట్రో ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో నిర్మించిన ఈ నదీగర్భ మెట్రోను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవలే ప్రారంభించారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మెట్రో కార్యకలాపాలు పబ్లిక్‌కు అందుబాటులోకి వచ్చాయి. మెట్రో రైడ్‌కు ప్రయాణికులను అనుమతిస్తున్నారు. దీంతో దేశంలోనే మొట్టమొదటి నదీగర్భ మెట్రోలో ప్రయాణించేందుకు స్థానికులు ఆసక్తి కనబరుస్తున్నారు.

దేశంలోనే మొట్టమొదటి నదీ గర్భ మెట్రో ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో నిర్మించిన ఈ నదీగర్భ మెట్రోను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవలే ప్రారంభించారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మెట్రో కార్యకలాపాలు పబ్లిక్‌కు అందుబాటులోకి వచ్చాయి. శుక్రవారం ఉదయం నుంచి మెట్రో రైడ్‌కు ప్రయాణికులను అనుమతిస్తున్నారు. దీంతో దేశంలోనే మొట్టమొదటి నదీగర్భ మెట్రోలో ప్రయాణించేందుకు స్థానికులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ మేరకు మెట్రో స్టేషన్‌కు పోటెత్తారు. పెద్దసంఖ్యలో ప్రయాణికులు హౌరా మైదాన్‌ స్టేషన్‌కు చేరుకున్నారు. దీంతో అక్కడ రద్దీ నెలకొంది. టికెట్‌ కౌంటర్ల వద్ద భారీ క్యూలైన్లు దర్శనమిచ్చాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలను కోల్‌కతా మెట్రో రైలు అధికారులు సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు.

మరోవైపు ప్రయాణికులు ఈ అండర్‌ వాటర్‌ మెట్రోలో ప్రయాణించి థ్రిల్‌ను ఫీల్‌ అవుతున్నారు. అంతేకాకుండా సెల్ఫీలు, ఫొటోలతో సందడి చేస్తున్నారు. ‘వందే భారత్‌..’, ‘భారత్‌ మాతా కీ జై’ నినాదాలు చేస్తూ రైలు ప్రయాణాన్ని ఆస్వాదిస్తున్నారు. ఈ మేరకు దేశంలోనే మొదటి నదీగర్భ మెట్రోలో తమ ప్రయాణ అనుభవాలను పంచుకుంటున్నారు. ఈ మెట్రోను అందుబాటులోకి తెచ్చినందుకు ముందుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఈ రైల్లో ప్రయాణించేందుకు ఎంతో ఉత్సాహంగా ఉన్నామని, అయితే టికెట్లు పొందడానికే కాస్త సమయం పడుతోందంటూ ప్రయాణికులు చెబుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..

Follow us on