ఇది.. కొబ్బరికాయ కాదు.. సాక్షాత్తు వినాయకుడే !!
తెల్ల జిల్లేడు చెట్టు బాగా పెరిగి పెద్దదైన తర్వాత దాని వేర్లలో వినాయక రూపం సంతరించుకుంటుందని పెద్దలంటూ ఉంటారు. అలా ఏర్పడిన రూపాన్ని అర్కగణపతిగా పూజిస్తారు. ఇది అనాదిగా వస్తోంది. అయితే ఇటీవల కాలంలో బొప్పాయిలోనూ, పలు రకాల కూరగాయల్లోనూ వినాయక రూపాలు కనిపించినట్టు నెట్టింట చాలానే వార్తలు వైరల్ అయ్యాయి.
అయితే తాజాగా కొబ్బరికాయ సాక్షాత్తు వినాయక రూపంలో ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇప్పుడీ ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో చర్చనీయాంశమైంది. పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం మండలం కాకులు ఇల్లెందుల పర్రులో ఈ ఘటన జరిగింది. ఇక్కడ కొబ్బరి బొండాంలో వినాయకుడి రూపం కనిపించింది. పసల భాస్కరరావు తన పొలంలోని కొబ్బరి చెట్ల నుండి కాయలు తీస్తుండగా ఒక చెట్టు నుండి తీసిన కొబ్బరికాయల్లో వినాయకుని ఆకారం పోలిన కొబ్బరికాయ కనిపించింది. ఆ కొబ్బరికాయకు తొండం ఉండడంతో పాటు పూర్తిగా గణనాథుని ఆకారాన్ని పోలి ఉండడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఎప్పుడు ఇటువంటి కాయలు చూడకపోవటంతో అందరూ ఆ కాయను ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కోట్లలో భారీ స్కామ్.. బాధితుల్లో భారతీయులు..
బిలియన్ సం.రాలు పట్టే లెక్కను 5 నిమిషాల్లో చేసేస్తుంది.. అద్భుతం అన్న మస్క్
మతగురువు రాసలీలలు.. ఆధ్యాత్మిక భార్యలు అంటూ 20 మందిపై..
ట్రంప్ కీలక నిర్ణయం.. భారతీయులకు గుడ్ న్యూస్ అవుతుందా ??
అరటి పండు గొడవ.. రైళ్లనే ఆపేసిన కోతులు !!