Snake Hulchal: నాగుపాము తలపై ముద్దుపెట్టిన స్నేక్ క్యాచర్.. ఊహించని షాకిచ్చిన స్నేక్..!
కర్ణాటకలోని శివమొగ్గ ప్రాంతంలో ఓ నాగుపాము కలకలం సృష్టించింది. దాంతో స్థానికులు స్నేక్ క్యాచర్ అలెక్స్‌కు సమాచారం అందించారు. అతడు నాగుపామును చాకచక్యంగా పట్టుకున్నాడు.
సాధారణంగా పాములంటే ఎంతటివారికైనా భయమే. పాము పేరు చెబితేనే ఆమడదూరం పారిపోయేవారు చాలామంది ఉంటారు. అలాగే పాములను చాకచక్యంగా పట్టుకొని అలాంటి వారిని కాపాడేవారు కొందరుంటారు. తాజాగా ఈ కోవకు చెందిన ఓ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. అది ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. కర్ణాటకలోని శివమొగ్గ ప్రాంతంలో ఓ నాగుపాము కలకలం సృష్టించింది. దాంతో స్థానికులు స్నేక్ క్యాచర్ అలెక్స్‌కు సమాచారం అందించారు. అతడు నాగుపామును చాకచక్యంగా పట్టుకున్నాడు. పాము తన చేతికి చిక్కగానే గుడ్ స్నేక్ అంటూ.. దాని తలపై ఓ ముద్దు పెట్టాడు. అంతే! ఒక్కసారిగా విషసర్పం నన్ను పట్టుకున్నదే కాకుండా ముద్దు కూడా పెడతావా.. అంటూ అతనిపై ఎటాక్ చేసింది. అతడి పెదవిపై కాటు వేసింది. దెబ్బకి ఆ పామును తీసుకెళ్లి సురక్షితంగా అటవీ ప్రాంతంలో విడిచిపెట్టి.. ఆ తర్వాత చికిత్సకోసం ఆస్పత్రికి పరుగెత్తాడు. కాగా, ప్రస్తుతం అలెక్స్ కోలుకుంటున్నాడని వైద్యులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఎంత స్నేక్ క్యాచర్ అయినా పాములతో పరాచకాలు ప్రమాదం అంటున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Boys rent for girls: అమ్మాయిల కోసం అద్దెకు అబ్బాయిలు.! గంటకు ఇంత లెక్కన కిరాయికి బాయ్ ఫ్రెండ్..
Russia bat: ముంచుకొస్తున్న మరో డేంజరస్ వైరస్.. రష్యాలో కనుగొన్న కొత్తరకం వైరస్.. ఎలా సోకుతుందంటే!
సోషల్ మీడియా సునామీ.. కొట్టుకుపోయిన గ్రీటింగ్ కార్డ్స్
పెగ్గు పడగానే పాత గొడవలు గుర్తుకొస్తాయి
ఇలాంటి సీన్ లేకుండా 31 దావత్ ఉంటుందా.. వైరల్ అవుతున్న వీడియో
కొండలా పేరుకుపోయిన అప్పు రూ.1.75 కోట్లకు రూ.147 కోట్లు
ఫ్యాక్టరీలో పనిచేస్తుండగా తెగి పడిన చెవి.. ఆ తర్వాత
బతికున్న వ్యక్తిని చనిపోయాడంటూ పోస్టుమార్టంకు..
మొసళ్ల నదిలోకి దూకిన వానరసైన్యం ప్రాణాలకు తెగించి సాహసం

