స్మశానికి కావలిగా కొండ చిలువ… హడలెత్తిపోయిన జనం(Video)
హైదరాబాద్‌లో ఫలక్‌నుమాలోని ముస్లిం శ్మశానవాటికలో ఓ భారీ కొండ చిలువ హల్‌చల్ చేసింది. సుమారు 6 అడుగుల పొడవైన ఈ కొండ చిలువ సమాధుల మధ్య..
హైదరాబాద్‌లో ఫలక్‌నుమాలోని ముస్లిం శ్మశానవాటికలో ఓ భారీ కొండ చిలువ హల్‌చల్ చేసింది. సుమారు 6 అడుగుల పొడవైన ఈ కొండ చిలువ సమాధులమధ్య తిరుగుతుండగా కొందరు ఆ దృశ్యాన్ని తమ మొబైల్ కెమెరాల్లో బంధించారు. ఆతర్వాత సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. నగరవాసులు ఆ వీడియోను చూసి హడలెత్తిపోతున్నారు. వీడియోలో వినిపిస్తోన్న మాటల ప్రకారం.. ఫలక్ నుమాలోని ఖాద్రి చమాన్ శ్మశానవాటికలో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. కాగా శ్మశానవాటికలో భారీ కొండచిలువ కనిపించడంతో ఆ చుట్టుపక్కల ఉండే స్థానికులు హడలెత్తిపోతున్నారు.
Published on: Oct 07, 2022 09:29 AM
వైరల్ వీడియోలు