అల్లుడికి ఇద్దామనుకుని సారె తెస్తే.. మామలెత్తుకెళ్లారు..
ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. పలుచోట్ల డబ్బు, నగలు, మద్యం భారీగా పట్టుపబడుతున్నాయి. ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసిన పోలీసులు అనుమానాస్పదంగా కనిపించిన ప్రతి వాహనాన్ని జల్లెడ పడుతున్నారు. ఈ తనిఖీల్లో భాగంగానే చిత్తూరు జిల్లాలో భారీగా వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. అయితే పోలీసులు స్వాధీనం చేసుకున్నది ఏ రాజకీయ నేతవో కాదు..
ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. పలుచోట్ల డబ్బు, నగలు, మద్యం భారీగా పట్టుపబడుతున్నాయి. ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసిన పోలీసులు అనుమానాస్పదంగా కనిపించిన ప్రతి వాహనాన్ని జల్లెడ పడుతున్నారు. ఈ తనిఖీల్లో భాగంగానే చిత్తూరు జిల్లాలో భారీగా వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. అయితే పోలీసులు స్వాధీనం చేసుకున్నది ఏ రాజకీయ నేతవో కాదు.. శుభమా అంటూ పెళ్లి చేసుకొని సారెతో అత్తారింటికి వెళ్తున్న ఓ పెళ్లికూతురి సారెను స్వాధీనం చేసుకున్నారు. దీంతో పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బాధితులు. చిత్తూరు జిల్లా యాదమరి బైపాస్ రోడ్‌లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. అటుగా ఓ పెళ్లి బృందానికి సంబంధించిన ఒక కారు, బస్సు వెళ్తున్నాయి. బెంగళూరునుంచి నెల్లూరుకు వెళ్తోన్న ఆ పెళ్లి బృందాన్ని తనిఖీల్లో భాగంగా ఆపారు పోలీసులు. వారి వాహనాలను చెక్ చేశారు. ఓ కారులో దండిగా వెండి వస్తువులు కనిపించాయి. అయితే వాటికి సరైన పత్రాలు, ఆధారాలు లేకపోవడంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు చిత్తూరు టూ టౌన్ పోలీసులు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గోవాలో క్యాంప్ పాలిటిక్స్ అక్కడేం జరుగుతోందో వేరే చెప్పాలా ??
బ్యాంకులో డబ్బు కొల్లగొట్టి పారిపోయిన చిన్నారులు !! చివరికి ??
Velliangiri Mountains: కొండలు దాటి శివయ్యను దర్శించుకునే సాహస యాత్ర
Irfan Pathan: హార్దిక్ పాండ్యా కెప్టెన్సీపై ఇర్ఫాన్ పఠాన్ సంచలన వ్యాఖ్యలు