Viral: అనాథలా పెరిగిన కోటీశ్వరుడు! సీన్ కట్ చేస్తే.. 26 ఏళ్లు తరువాత.. వీడియో.
అతడో మిలియనీర్ దంపతుల కుమారుడు. చిన్నప్పుడే వారి నుంచి తప్పిపోయి.. పాతికేళ్లుగా అనాథలా జీవితాన్ని గడిపాడు. చివరికి తన ఇరవై ఆరో ఏట తల్లిదండ్రుల వద్దకు చేరుకున్నాడు. ఈ ఘటన చైనాలో జరిగింది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ప్రకారం..
చైనాకు చెందిన ఓ మిలియనీర్ దంపతుల కుమారుడు షి కిన్షువాయ్. 26 ఏళ్ల క్రితం కిడ్నాప్‌నకు గురయ్యాడు. అప్పటికి అతడి వయసు మూడు నెలలు. ఆ రోజు నుంచి ఆ దంపతులు కుమారుడి కోసం వెతుకుతూనే ఉన్నారు. అందుకోసం దాదాపు రూ. కోటి వరకు ఖర్చు చేశారు. ఎట్టకేలకు ఇటీవల కుమారుడి ఆచూకీ కనుగొన్నారు. దీంతో వాళ్ల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది. 25 ఏళ్ల పాటు అనాథలా జీవించిన కుమారుడు షి కిన్షువాయ్ తమ వద్దకు రావడంతో పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు.
అతడికి ఇవ్వడానికి బహుళ అంతస్తుల భవనం, విలాసవంతమైన కారు సహా పలు బహుమతులు ఏర్పాటు చేశారు. అయితే ఆస్తి, విలాసవంతమైన జీవితం వద్దని తాను, తన భార్య ఉండటానికి ఒక ఫ్లాట్ మాత్రం ఇవ్వాలని కిన్షువాయ్ కోరాడు. దీంతో కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయారు. ఈ ఘటనకు సంబంధించిన విషయాన్ని వారు సోషల్ మీడియా వేదికగా పంచుకోవడంతో వైరల్‌గా మారింది. మిలియన్ల ఆస్తి తనకు ఇస్తామన్నా..సాధారణ జీవితానికే ప్రాధాన్యం ఇచ్చిన అతడిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ‘‘అన్నేళ్లు అనాథగా పెరిగిన వారికి కావాల్సింది. డబ్బు కాదు..ప్రేమాభిమానాలు. అతడు వాటినే కోరుకున్నాడు’’ అని ఓ నెటిజన్ రాసుకొచ్చారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.