Viral Video: మనుషులనే కాదు.. జంతువులను సైతం వదలని స్మార్ట్‌ఫోన్‌ జాడ్యం. వైరల్‌ వీడియోపై ఓ లుక్కేయండి..

|

Dec 05, 2021 | 7:33 AM

Viral Video: ఆధునిక ప్రపంచంలో స్మార్ట్‌ఫోన్‌ తయారీ ఓ విప్లవాత్మక మార్పుగా చెప్పవచ్చు. ఎన్నో అనూహ్య మార్పులకు స్మార్ట్‌ఫోన్‌ వేదికగా మారింది. ప్రపంచాన్ని అరచేతిలోకి తీసుకొచ్చిన ఈ అద్భుత గ్యాడ్జెట్‌కు..

Viral Video: మనుషులనే కాదు.. జంతువులను సైతం వదలని స్మార్ట్‌ఫోన్‌ జాడ్యం. వైరల్‌ వీడియోపై ఓ లుక్కేయండి..
Viral Video
Follow us on

Viral Video: ఆధునిక ప్రపంచంలో స్మార్ట్‌ఫోన్‌ తయారీ ఓ విప్లవాత్మక మార్పుగా చెప్పవచ్చు. ఎన్నో అనూహ్య మార్పులకు స్మార్ట్‌ఫోన్‌ వేదికగా మారింది. ప్రపంచాన్ని అరచేతిలోకి తీసుకొచ్చిన ఈ అద్భుత గ్యాడ్జెట్‌కు యావత్‌ ప్రపంచమే ఫిదా అయ్యింది. 8 ఏళ్ల కుర్రాడి నుంచి 80 ఏళ్ల ముసలివాళ్ల వరకు అందరూ స్మార్టఫోన్లతోనే గడిపేస్తున్నారు. పక్కన ఉన్న వ్యక్తులను సైతం పట్టించుకోకుండా ఫోన్‌ తెరకు అతుక్కుపోతున్నారు. క్షణం సమయం దొరికందంటే చాలు జేబులోని స్మార్ట్‌ఫోన్‌లోకి దూరిపోతున్నారు. ఇలా ఫోన్‌ మనిషి జీవితంలో ఓ భాగమైపోయింది.

అయితే స్మార్ట్‌ ఫోన్‌ పిచ్చి కేవలం మనుషులకేనా అంటే.. కాదనే సమాధానం వస్తుంది. జంతువులు సైతం స్మార్ట్‌ ఫోన్‌కు ఫిదా అవుతున్నాయి. తాజాగా నెట్టింట వైరల్‌గా మారిన ఓ వీడియోనే దీనికి నిదర్శనంగా కనిపిస్తోంది. ఓ మహిళా జూపార్క్‌కు వెళ్లింది. అద్దాల ఎన్‌క్లోజర్‌ అవతలి వైపు ఓ చింపాజి కూర్చొని ఉంది. దానిని చూసిన ఆ మహిళ.. ఎంచక్కా కింద కూర్చొని తన ఐఫోన్‌ను చూడడం ప్రారంభించింది. అంతటితో ఆగకుండా ఫోన్‌ను ఆ చింపాజికి చూడా చూపించింది. దీంతో అసలు అదేంటో తెలియని ఆ జంతువు కూడా ఎంతో ఆసక్తిగా స్మార్ట్‌ఫోన్‌ను చూస్తూ ఉండిపోయింది.

దీనంతటినీ అక్కేడ ఉన్న వ్యక్తి వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన కొందరు నెటిజన్లు.. ఈ స్మార్ట్‌ ఫోన్‌ పిచ్చి జంతువులను కూడా వదలట్లేదుగా అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Also Read: NV Ramana – Telugu: తెలుగు భాష తన ఔన్నత్యాన్ని కోల్పోతోంది.. తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన సీజేఐ ఎన్‌వి రమణ..

Marriage: పెళ్లికి ముందు ప్రతి అమ్మాయి తన భాగస్వామిని ఈ 3 విషయాలు తప్పక అడగాలి.. అవేంటంటే..

Limca Book of Records: తక్కువైంది జస్ట్ ఎత్తు మాత్రమే.. పట్టుదల కాదు.. హైదరాబాద్ వ్యక్తి రికార్డ్.. ఎందుకంటే..