కొండెక్కిన చికెన్‌ ధర.. ముక్క తినాలంటే కష్టమే

Updated on: Jan 17, 2026 | 11:27 AM

తెలుగు రాష్ట్రాల్లో చికెన్‌, మటన్‌ ధరలు విపరీతంగా పెరిగాయి. సంక్రాంతి వేళ నాన్‌వెజ్‌ ప్రియుల జేబులు ఖాలీ చేస్తున్నాయి. సాధారణ రోజుల్లో కంటే చికెన్‌ కిలోకి 100 వరకూ పెరిగింది. కేజీ స్కిన్‌లెస్‌ చికెన్‌ ధర హైదరాబాద్‌లో రూ.360 రూపాయలు పలుకుతోంది. దాదాపు అన్ని ప్రాంతాల్లో ఇవే ధరలు పలుకుతున్నాయి. ఇక మటన్‌ విషయానికి వస్తే కిలో మటన్‌ రూ.1000లు దాటేసింది. బోన్‌లెస్‌ మటన్‌ అయితే రూ.1200లు పలుకుతోంది.

ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి వేళ మూడో రోజు కనుమ పండుగ సందర్భంగా చాలామంది నాన్ వెజ్ వంటకాలు తింటారు. ఈ క్రమలో చికెన్‌, మటన్‌ మాత్రమే కాదు చేపలకు మంచి డిమాండ్‌ ఉంటుంది. అందుకే ఇప్పుడు చేపల ధరలు కూడా ఆకాసాన్నంటుతున్నాయి. విజయవాడలో అయితే చికెన్‌ రేట్లు వాచిపోతున్నాయి. కనుమ పండగరోజు నగరంలో చికెన్‌, మటన్‌ రేట్లు మరింత పెరిగాయి. గత ఏడాదితో పోలిస్తే రూ 100 వంద నుంచి 150 వరకు ధరలు అధికంగా ఉన్నాయి. బ్రాయిలర్‌ చికెన్‌ కేజీ 350 రూపాయలు పలుకుతోంది. ఇక నాటుకోడి అయితే వెయ్యిరూపాయలకు చేరింది. పందెం కోడి ధర అయితే 6వేల నుంచి రూ.10,000ల వరకూ పలుకుతోంది.

మరిన్ని వీడియోల కోసం :

బలగం వేణు రెండో సినిమాపై క్లారిటీ వీడియో

ఆ ఒక్కటీ చేయకపోతే మనుషులకు..జంతువులకు తేడా ఏంటి?

యాభై ఏళ్లుగా నిద్రపోని వింత వ్యక్తి.. డాక్లర్లే పరేషాన్‌!

సంక్రాంతి వచ్చిందంటే నిజామాబాద్ లో నోరూరించే ఘేవర్ స్వీట్