Cheetah: కొండల్లో చిరుత సంచారం.. ఆందోళనలో గ్రామస్తులు.!

Updated on: Jul 06, 2023 | 8:59 PM

ఆ గ్రామంలోని కొండల్లో చిరుత సంచారం స్థానికులకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. మేకలు, పశువులమందపై ఎక్కడ దాడిచేస్తుందో, ఏక్షణం ఎవరిని పొట్టనపెట్టుకుంటుందోనని గజగజా వణికిపోతున్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కోటేకల్ గ్రామం కొండల్లో చిరుత సంచారం కలకలం రేపుతుంది.

ఆ గ్రామంలోని కొండల్లో చిరుత సంచారం స్థానికులకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. మేకలు, పశువులమందపై ఎక్కడ దాడిచేస్తుందో, ఏక్షణం ఎవరిని పొట్టనపెట్టుకుంటుందోనని గజగజా వణికిపోతున్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కోటేకల్ గ్రామం కొండల్లో చిరుత సంచారం కలకలం రేపుతుంది. గత రెండు రోజుల నుండి కొండల్లో చిరుత తిరుగుండటంతో గ్రామ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. నిన్న మేకల మంద దాడి చేసిన చిరుత గ్రామంపై ఎక్కడ దాడి చేస్తుందో అని గ్రామ ప్రజలు రాత్రిపగలు బిక్కు బిక్కు మంటూ గడుపుతున్నారు. కొంతమంది యువకులు రాత్రి కొండల్లో టార్చీ లైట్లు పట్టుకొని పులి జాడ కోసం వెతుకుండగా ఓ కొండపై పులి ఉన్నట్టు గుర్తించి వెంటనే సెల్ ఫోన్ లలో చిత్రికరించారు. ఈ కొండల్లో పులి ఉన్నట్టు ఎన్నో సార్లు ఫారెస్ట్ అధికారులకి సమాచారం ఇచ్చిన దాన్ని పట్టుకోవడం లేదని ఇప్పటికైనా గ్రామం పై దాడి చేయక ముందే పులిని పట్టుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...