Srisailam: శివుడి చెంత చిరుతపులి.! భక్తుల్లో భయం , భక్తి ఒకేసారి.. వీడియో వైరల్.
నంద్యాల జిల్లా శ్రీశైలంలో మరోసారి చిరుతపులి కలకలం రేపింది. ఆలయ పరిధిలోని రెడ్ల సత్రం సమీపంలో చిరుతపులి భక్తుల కంట పడింది. రాత్రి వేళ శ్రీశైలం ఔటర్ రింగ్ రోడ్ సమపీపంలోని రోడ్డుకు దగ్గరలో ఉన్న అటవీప్రాంతంనుంచి చిరుత ఆలయ సమీపంలోకి వచ్చింది. ఆహారం కోసం వెతుకుతూ ఉన్న చిరుతను చూసి స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పొదల దగ్గర మాటు వేసి ఉన్న చిరుతను చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
నంద్యాల జిల్లా శ్రీశైలంలో మరోసారి చిరుతపులి కలకలం రేపింది. ఆలయ పరిధిలోని రెడ్ల సత్రం సమీపంలో చిరుతపులి భక్తుల కంట పడింది. రాత్రి వేళ శ్రీశైలం ఔటర్ రింగ్ రోడ్ సమపీపంలోని రోడ్డుకు దగ్గరలో ఉన్న అటవీప్రాంతంనుంచి చిరుత ఆలయ సమీపంలోకి వచ్చింది. ఆహారం కోసం వెతుకుతూ ఉన్న చిరుతను చూసి స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పొదల దగ్గర మాటు వేసి ఉన్న చిరుతను చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అటువైపు ఎవరూ వెళ్లకుండా అందరినీ అలర్ట్ చేశారు. మరోవైపు కొందరు చిరుతను ప్రత్యక్షంగా చూసామంటూ తెగ ఆనందపడిపోయారు. చిరుత వేటకోసం నక్కి నక్కి వెళ్తున్న దృశ్యాలను తమ మొబైల్ ఫోన్లలో రికార్డ్ చేశారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తెగ వైరల్‌గా మారింది. మరోవైపు శ్రీశైలంలో చిరుత సంచారంతో భక్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఏక్షణం ఎవరిపై దాడిచేస్తుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడ చిరుతపులులు ఔటర్ రింగ్ రోడ్ శివాజి స్పూర్తి కేంద్రం రూద్రాపార్క సమీపంలో చిరుతలు సంచరిస్తూ భక్తుల కంటపడ్డాయి. అయితే అటవీశాఖ అధికారులు వెంటనే అక్కడకు చేరుకుని చిరుతపులిని అడవిలోకి పంపే ప్రయత్నం చేశారు. తాజాగా మళ్లీ చిరుత ప్రత్యక్షమవడంతో శ్రీశైలం దేవస్థానం అధికారులు అటవీశాఖ అధికారులు భక్తులను అప్రమత్తం చేశారు. శ్రీశైలం వచ్చి వేళ్లే భక్తులు అప్రమత్తంగా ఉండాలని స్దానికులకు భక్తులకు విజ్ఞప్తి చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..