Viral Video: పిల్లితో చిరుత పోరాటం.. గెలుపెవరిదో తెలుసా..? నెట్టింట్లో సందడి చేస్తోన్న వీడియో

|

Sep 06, 2021 | 6:07 PM

Cheetah vs Cat: ఈ సంఘటన మహారాష్ట్రలోని నాసిక్‌లో జరిగింది. నాసిక్‌లోని బావిలో చిరుతపులితో పాటు పిల్లి కూడా చిక్కుకుంది. ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో సంచలనంగా మారింది.

Viral Video: పిల్లితో చిరుత పోరాటం.. గెలుపెవరిదో తెలుసా..?  నెట్టింట్లో సందడి చేస్తోన్న వీడియో
Cheetah Vs Cat Viral Video
Follow us on

Cheetah vs Cat: పిల్లి, చిరుతపులి మధ్య పోరాటాన్ని మీరెప్పుడైనా చూశారా..? అయితే ఈ వీడియో చూడండి. చిరుతకు దొరికిన ఏ జంతువైనా తప్పించుకోవడం చాలా కష్టం. కానీ,ఈ వీడియోలో పిల్లి.. చిరుతను చిక్కుల్లోకి నెట్టడంతో వైరల్‌గా మారింది. అసలు విషయానికి వెళ్తే.. ఈ సంఘటన మహారాష్ట్రలోని నాసిక్‌లో జరిగింది. నాసిక్‌లోని ఓ బావిలో చిరుతపులితో పాటు పిల్లి కూడా చిక్కుకుంది. అయితే ఈ రెండింటి మధ్య చిన్నపాటి పోరాటం కూడా జరిగింది. ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో సంచలనంగా మారింది.

పిల్లిని చూచిన చిరుత పులి దానిపై దాడి చేయబోయింది. ఇంతలో పిల్లి తప్పించుకుని పారిపోయేందుకు సిద్ధమైంది. పిల్లిని వెంబడిస్తూ చిరుత కూడా పరుగు లంఖించుకుంది. ఈ రెండూ ఓ బావిలో పడ్డాయి. కోపంతో ఉన్న చిరుత పిల్లిపై దాడి చేసేందుకు ప్రయత్నించింది. పిల్లి కూడా ధాటిగానే స్పందించింది. అయితే, చిరుత మాత్రం పిల్లిని ఏమీ చేయకుండా వదిలేయడం విశేషం. ఈ రెండింటి మధ్య పోరాటాన్ని నెట్టింట్లో పెట్టడంతో వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. అందరినీ ఆకట్టుకుంటూ నెట్టింట్లో తెగ సందడి చేస్తోంది.

వెస్ట్ నాసిక్ డివిజన్ డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, పంకజ్ గార్గ్, ఏఎన్‌ఐతో మాట్లాడుతూ, పిల్లిని వెంబడిస్తున్నప్పుడు పిల్లితో పాటు చిరుత పులి కూడా బావిలో పడిందని వివరించారు. చిరుతపులితోపాటు పిల్లిని కూడా రక్షించామని తెలిపారు. చిరుతను కాపాడి అడవిలో వదిలేసినట్టు ఆయన తెలిపారు. రాత్రి సమయంలో ఇవి బావిలో పడిపోయి ఉండొచ్చని ఆయన అన్నారు. కాగా, బావిలో నీరు చాలా తక్కువగా ఉందని తెలిపారు.

Also Read:

Viral Video: శరీరాన్ని స్ప్రింగ్‏గా మార్చేసిన అమ్మాయి.. ప్రమాదకరమైన విన్యాసాలు.. పట్టుతప్పిందంటే అంతే సంగతులు..

Special Bulletin Video: వైరల్ అవుతున్న పందుల పోటీలు..!| తెల్ల చెక్కరతో మతిమరుపు..!(స్పెషల్ వైరల్ వీడియోలు).

Viral Video: టెన్షన్ ఎందుకు దండగా.. గోల్‌గప్పాలుండగా అంటోన్న వధువు.. నెట్టింట్లో వైరల్‌గా మారిన వీడియో