India – Bharat: ఇండియాకు బదులుగా భారత్‌.. భారత్‌ పేరును 7 వేల ఏళ్లకు పూర్వం విష్ణు పురాణంలో ప్రస్తావన..

కొత్త తరానికి దేశ చరిత్ర, సంస్కృతులను పరిచయం చేసే పాఠశాల పాఠ్య పుస్తకాల నుంచి ఇండియా పేరును తీసేసి ‘భారత్‌’ అని చేర్చాలని ఎన్సీఈఆర్టీ కమిటీ సిఫారసు చేసింది. పాఠశాల స్థాయిలో అన్ని తరగతుల పాఠ్యపుస్తకాల్లోనూ ‘ఇండియా’ను ‘భారత్‌’గా మార్చటంతో పాటు ‘ప్రాచీన చరిత్ర’ స్థానంలో ‘క్లాసికల్‌ హిస్టరీ’ని ప్రవేశపెట్టాలని, ప్రత్యేకంగా ‘ఇండియన్‌ నాలెడ్జ్‌ సిస్టం’ను తీసుకురావాలని సిఫారసు చేసినట్టు కమిటీ చైర్‌పర్సన్‌ సీఐ ఐసాక్‌ తెలిపారు.

India - Bharat: ఇండియాకు బదులుగా భారత్‌.. భారత్‌ పేరును 7 వేల ఏళ్లకు పూర్వం విష్ణు పురాణంలో ప్రస్తావన..

|

Updated on: Oct 27, 2023 | 9:27 PM

కొత్త తరానికి దేశ చరిత్ర, సంస్కృతులను పరిచయం చేసే పాఠశాల పాఠ్య పుస్తకాల నుంచి ఇండియా పేరును తీసేసి ‘భారత్‌’ అని చేర్చాలని ఎన్సీఈఆర్టీ కమిటీ సిఫారసు చేసింది. పాఠశాల స్థాయిలో అన్ని తరగతుల పాఠ్యపుస్తకాల్లోనూ ‘ఇండియా’ను ‘భారత్‌’గా మార్చటంతో పాటు ‘ప్రాచీన చరిత్ర’ స్థానంలో ‘క్లాసికల్‌ హిస్టరీ’ని ప్రవేశపెట్టాలని, ప్రత్యేకంగా ‘ఇండియన్‌ నాలెడ్జ్‌ సిస్టం’ను తీసుకురావాలని సిఫారసు చేసినట్టు కమిటీ చైర్‌పర్సన్‌ సీఐ ఐసాక్‌ తెలిపారు. అయితే, కమిటీ సిఫారసుపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఎన్సీఈఆర్టీ చైర్మన్‌ దినేష్‌ సక్లానీ తెలిపారు. భారత్‌ అనే పేరు 7 వేల ఏళ్ల పురాతనమైన విష్ణు పురాణంలో ఉపయోగించారని, అందుకే దేశాన్ని ఆ పేరుతో సంబోధించాలని సూచించినట్లు ఐసాక్‌ తెలిపారు. అయితే ఎన్సీఈఆర్టీ సిఫారసుపై ప్రతిపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ‘ఇండియాను భారత్‌గా మార్చుతున్నట్టయితే రిజర్వ్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఇండియన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీన్‌, ఇండియన్‌ ఫారిన్‌ సర్వీస్‌ను ఎందుకు కొనసాగిస్తున్నాం. ఎన్‌సీఈఆర్‌టీ ప్రతిపాదన పూర్తిగా ప్రజావ్యతిరేకం. ఎన్డీఏ సర్కారు వారిపై ఒత్తిడి తెచ్చింది’ అని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ ఆరోపించారు. విపక్ష కూటమికి ఇండియా అని పేరుపెట్టినప్పటి నుంచి అధికార బీజేపీలో భయం మొదలైందని ఆర్‌ఎల్డీ ఎద్దేవా చేసింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..

Follow us
రాజయ్య అంగిల జొర్రి ఆగం పట్టిచ్చిన తొండ | బతుకమ్మ స్టెప్పులతో..
రాజయ్య అంగిల జొర్రి ఆగం పట్టిచ్చిన తొండ | బతుకమ్మ స్టెప్పులతో..
తల మసాజ్‌ వల్ల పక్షవాతం.! యువకుడి ప్రాణంతో బార్బర్ చెలగాటం..
తల మసాజ్‌ వల్ల పక్షవాతం.! యువకుడి ప్రాణంతో బార్బర్ చెలగాటం..
అమ్మా క్షమించు.! మారాలని ఉన్నా మారలేక శాశ్వతంగా వెళ్లిపోతున్నా.!
అమ్మా క్షమించు.! మారాలని ఉన్నా మారలేక శాశ్వతంగా వెళ్లిపోతున్నా.!
మగమహారాజులకు డేంజర్ బెల్స్.. ఆ క్యాన్సర్ ముప్పు వారికే ఎక్కువ.!
మగమహారాజులకు డేంజర్ బెల్స్.. ఆ క్యాన్సర్ ముప్పు వారికే ఎక్కువ.!
దారుణం.! పోలీసును వెంటాడి, కారుతో ఈడ్చుకెళ్లి.. వీడియో వైరల్..
దారుణం.! పోలీసును వెంటాడి, కారుతో ఈడ్చుకెళ్లి.. వీడియో వైరల్..
సూసైడ్‌ చేసుకున్న టిక్‌టాక్ స్టార్, షాక్‌లో ఫ్యాన్స్‌.!
సూసైడ్‌ చేసుకున్న టిక్‌టాక్ స్టార్, షాక్‌లో ఫ్యాన్స్‌.!
వామ్మో.. తీయని కేక్‌ తింటే ఇన్ని ఆరోగ్య సమస్యలా? 12 రకాల కేకులు..
వామ్మో.. తీయని కేక్‌ తింటే ఇన్ని ఆరోగ్య సమస్యలా? 12 రకాల కేకులు..
మెట్రోలో పీతల సందడి.. మెట్రోలో ప్రయాణికురాలి సంచి నుంచి బయటపడ్డయి
మెట్రోలో పీతల సందడి.. మెట్రోలో ప్రయాణికురాలి సంచి నుంచి బయటపడ్డయి
ఇకపై రైల్వే ట్రాక్‌పై వస్తువులు పెట్టేవారి అంతు చూస్తాం.!
ఇకపై రైల్వే ట్రాక్‌పై వస్తువులు పెట్టేవారి అంతు చూస్తాం.!
హౌతీ తీవ్రవాదులపై ఇజ్రాయెల్ పంజా.! యెమెన్‌లో భీకర దాడులు..
హౌతీ తీవ్రవాదులపై ఇజ్రాయెల్ పంజా.! యెమెన్‌లో భీకర దాడులు..