లక్ష అడుగుల ఎత్తులో పెళ్లి.. ఒక్కొక్కరికీ కోటి రూపాయలు..

ప్రతి ఒక్కరి జీవితంలోనూ పెళ్లి అనేది చాలా ముఖ్యమైన ఘట్టం. అలాంటి పెళ్లి ఎప్పటికీ గుర్తుండిపోయే మధురానుభూతిలా మిగిలిపోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అప్పు చేసైనా సరే పెళ్లి గ్రాండ్‌గా చేసుకోవాలనుకుంటారు. ఈ నేపథ్యంలో వెడ్డింగ్ మార్కెట్ ఇటీవలి కాలంలో బిలియన్ డాలర్ల వ్యాపారంగా మారిపోయింది.

లక్ష అడుగుల ఎత్తులో పెళ్లి.. ఒక్కొక్కరికీ కోటి రూపాయలు..

|

Updated on: May 27, 2023 | 12:51 PM

ప్రతి ఒక్కరి జీవితంలోనూ పెళ్లి అనేది చాలా ముఖ్యమైన ఘట్టం. అలాంటి పెళ్లి ఎప్పటికీ గుర్తుండిపోయే మధురానుభూతిలా మిగిలిపోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అప్పు చేసైనా సరే పెళ్లి గ్రాండ్‌గా చేసుకోవాలనుకుంటారు. ఈ నేపథ్యంలో వెడ్డింగ్ మార్కెట్ ఇటీవలి కాలంలో బిలియన్ డాలర్ల వ్యాపారంగా మారిపోయింది. ఎప్పటికప్పుడు కొంగొత్త ఐడియాలతో వెడ్డింగ్ ప్లానర్లు ముందుకు వస్తున్నారు. ఇటీవల డెస్టినేషన్ వెడ్డింగ్ బాగా పాపులర్ అయింది. అందుకే స్పేస్‌ పెర్‌స్పెక్టివ్‌ అనే ఓ సంస్థ అంతరిక్షంలో పెళ్లి వేదిక ఏర్పాటు చేసింది. వచ్చే ఏడాదినుంచే అందుబాటులోకి రానుందట. కుటుంబ సభ్యులు, బంధు మిత్రులతో కలిసి వేరే ప్రాంతానికి వెళ్లి అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకోవడమే డెస్టినేషన్ వెడ్డింగ్ అంటే. కొంతమంది సముద్ర తీరంలో పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడతారు. మరికొంత మంది పర్వత ప్రాంతాల్లో తాళి కట్టాలనుకుంటారు. ఇంకొందరుంటారు.. వీళ్లు భూమిమీద పెళ్లి బోర్‌.. అంతిరిక్షంలో పెళ్లి చేసుకుంటే ఆ కిక్కే వేరు అనుకుంటారు. అలాంటివారికోసం ఓ సంస్థ ముందుకొచ్చింది. భూమికి లక్ష అడుగుల ఎత్తులో, అంతరిక్షంలో పెళ్లి వేదికలను ఏర్పాటు చేసింది. స్పేస్ పెర్స్‌పెక్టివ్ (Space Perspective) అనే సంస్థ ఈ అసాధారణ ఐడియాకు రూపకల్పన చేసింది. కార్బన్-న్యూట్రల్ బెలూన్ ద్వారా వీరు వధూవరులను అంతరిక్షంలోకి పంపిస్తారు. ఆ బెలూన్‌లను పెద్ద పెద్ద కిటికీలతో భూమి మొత్తం కనిపించేలా ఉంటాయి. ఆ స్పేస్ షిప్ పేరు నెఫ్ట్యూన్ (Neptune).

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఐస్‌క్రీమ్‌.. ధర తెలిస్తే షాకే

బస్సు డ్రైవర్‌ ఓవరాక్షన్‌.. సీఎం వార్నింగ్‌

నడిరోడ్డుపైనే యువతి, యువకుడు.. కట్‌చేస్తే కేసు నమోదు.. ఎందుకంటే ??

మ‌హిళ‌ల‌కు వాడిపడేసిన కండోమ్ పార్సిళ్లు !! ఎక్క‌డంటే ??

మొసలి రక్తాన్ని కాఫీలా తాగేస్తున్నాడు !! ఎందుకో తెలిస్తే షాకే

 

 

Follow us
Latest Articles