Viral Video: ఇనిస్టెంట్ ఖర్మ అంటే ఇదే.. మహిళ చైన్ కొట్టేద్దాం అనకున్నాడు.. ఆ తర్వాత
చేసిన తప్పుకు శిక్ష అనుభవించక తప్పదు అంటారు పెద్దలు.. అయితే ఆ శిక్ష ఎప్పుడు అనుభవిస్తాడు.. అనేదే అసలు పాయింటు.. ఇప్పుడు చేశిన తప్పుకు .. వచ్చే జన్మల శిక్ష పడుద్ది అని కొందరు పండితులు చెబుతుంటారు.. అసలు మరో జన్మ ఉంటుందో లేదో ఎవరో తెలుసు చెప్పండి. కానీ కొందరికి మాత్రం అప్పటికప్పుడే చేశిన తప్పుకు శిక్షలు పడుతుంటాయి. ఇది కూడా అలాంటి ఘటనే.
మూతికి మాస్కు పెట్టుకోని బండి నుంచి దిగాడు ఈ కేటుగాడు. తచ్చాడుతూ అక్కడే ఉన్న కిరాణా షాపులోకి వచ్చాడు. ఏదో కొంటున్నట్లు అక్కడికి వెళ్లి.. అక్కడ ఉన్న మహిళ చైన్ తెంపి పారిపోదామకున్నాడు. ఇంతలో అలర్టైన ఆ మహిళ.. వాడిని పట్టుకునేందుకు ప్రయత్నించింది. దీంతో పారిపోబోయి.. అక్కడే ఉన్న కుర్చి తగిలి కిందపడ్డాడు ఆ దొంగోడు. లేచి పారిపోబోతుంటే.. ఆ మహిళ అతడిని వెంటాడింది. అక్కడి స్థానికులు కూడా అలెర్టయి.. ఆ దొంగోడ్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. హైదరాబాద్ నార్సింగ్ వద్ద ఈ ఘటన వెలుగుచూసింది. ఇన్ స్టంట్ ఖర్మ అంటే ఇదే అని కామెంట్స్ పెడుతున్నారు ఈ వీడియో చూసిన నెటజన్స్.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
వైరల్ వీడియోలు
Latest Videos