Russian Spy: ఆ ‘రష్యా గూఢచారి తిమింగలం’ ఇక లేదు.! నార్వే ప్రజలకు బాగా మచ్చికైన బెలుగా..

|

Sep 06, 2024 | 9:09 PM

రష్యా గూఢచారి పేరిట ఆరేళ్ల నుంచి ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తూ వస్తున్న బెలుగా తిమింగలం తాజాగా చనిపోయింది. హవాల్దిమిర్‌గా పేరున్న ఈ తిమింగలం కళేబరం దక్షిణ నార్వేలోని నీటిపై తేలియాడుతూ స్థానికుల కంటబడింది. 14 అడుగుల పొడవు, 1,225 కిలోల బరువున్న హవాల్దిమిర్‌ కళేబరాన్ని క్రేన్‌తో బయటకు తీశారు. బెలుగా కళేబరంపై ఎటువంటి గాయాలు లేవని, మృతికి గత కారణాలను కనుగొనేందుకు పోస్టుమార్టం చేపట్టినట్లు అధికారులు చెప్పారు.

రష్యా గూఢచారి పేరిట ఆరేళ్ల నుంచి ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తూ వస్తున్న బెలుగా తిమింగలం తాజాగా చనిపోయింది. హవాల్దిమిర్‌గా పేరున్న ఈ తిమింగలం కళేబరం దక్షిణ నార్వేలోని నీటిపై తేలియాడుతూ స్థానికుల కంటబడింది. 14 అడుగుల పొడవు, 1,225 కిలోల బరువున్న హవాల్దిమిర్‌ కళేబరాన్ని క్రేన్‌తో బయటకు తీశారు. బెలుగా కళేబరంపై ఎటువంటి గాయాలు లేవని, మృతికి గత కారణాలను కనుగొనేందుకు పోస్టుమార్టం చేపట్టినట్లు అధికారులు చెప్పారు. ఒంటిపై కెమెరాను అమర్చేందుకు వీలుగా బెల్టు లాంటి ఒక పరికరం అమర్చి ఉండటం, దానిపై సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ అని రాసి ఉండటంతో నార్వే ప్రజలకు అప్పట్లో అనుమానం వచ్చింది. రష్యాయే నిఘా కోసం ఈ తిమింగలాన్ని పంపి ఉంటుందని భావించారు. సాధారణంగా తిమింగలాలు గుంపులుగా సంచరిస్తుంటాయి. అందుకు విరుద్ధంగా ఈ బెలుగా ప్రజలకు మచ్చికైంది. ఇంతకీ, ఇది రష్యా పంపిందేనా అన్న ప్రశ్నకు మాత్రం సమాధానం దొరకలేదు. బహుశా, రష్యా నిర్బంధంలో ఉంటూ అనుకోకుండా తప్పించుకుని వచ్చి ఉంటుందని, అందుకే ప్రజల సంజ్ఞలకు స్పందించే లక్షణం అబ్బి ఉంటుందని కొందరు వాదిస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.