AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: వారెవ్వా.. ఇలాంటి పిల్లి ఉండాల్సిందే.. చిన్నారి కోసం ఏం చేసిందో తెలిస్తే షాకవుతారు..

నెట్టింట్లో వైరల్ అయ్యే వీడియోలో ఎక్కువభాగం జంతువులకు సంబంధించినవే ఉంటాయి. తాజాగా ఓ పిల్లి వీడియో ఈకోవకే చెందుతుంది. ఈ వీడియోని చూస్తే మీరు కూడా ఈ నల్లపిల్లికి పెద్ద ఫ్యాన్ అవుతారు.

Viral Video: వారెవ్వా.. ఇలాంటి పిల్లి ఉండాల్సిందే.. చిన్నారి కోసం ఏం చేసిందో తెలిస్తే షాకవుతారు..
Cat Massage Video
Venkata Chari
|

Updated on: Apr 05, 2022 | 6:20 PM

Share

నెట్టింట్లో ప్రతిరోజూ ఎన్నో వీడియోలు సందడి చేస్తుంటాయి. వీటిలో కొన్ని నవ్విస్తే, మరికొన్ని ఆశ్చర్యపరుస్తుంటాయి. మరికొన్ని వీడియో(Viral Video)లు చూస్తే మాత్రం కన్నీటిని తెప్పిస్తుంటాయి. ముఖ్యంగా జంతువుల వీడియోలైతే జనాలు బాగా ఇష్టపడుతుంటారు. వైరల్ అయ్యే వీడియోలో ఎక్కువభాగం జంతువులకు సంబంధించినవే ఉంటాయి. తాజాగా నెట్టింట్లో ఓ పిల్లి(Cat) వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోని చూస్తే మీరు కూడా దానికి పెద్ద ఫ్యాన్ అవుతారు. వీడియోలో ఓ పిల్లవాడు బోర్లా పడుకుని ఉన్నట్లు చూడొచ్చు. అయితే, ఆ పిల్లవాడి వీపుపైన ఓ పిల్లి ఎంతో చక్కగా మసాజ్ చేస్తుంది. ఈ నల్లపిల్లి శిశువును రెండు కాళ్లతో, వీపుపై ప్రేమగా మసాజ్ చేయడం వీడియోలో కనిపిస్తుంది. అయితే, ఈ శిశువు ఎలాంటి భయం లేకుండా అలాగే పడుకుని ఉంటాడు. ఈ నల్లపిల్లి మసాజ్ ఆ పిల్లాడికి ఎంతో నచ్చినట్లుగా ఉంది. అలాగే పడుకుని సేద తీరుతున్నట్లు మనం వీడియోలో చూడొచ్చు.

ఈ వీడియోను డచ్ జంతు ప్రేమికుడు సోషల్ మీడియాలో పంచుకున్నాడు. బ్యూటెంగెబిడెన్ అకౌంట్‌లో ఈ వీడియోను పంచుకున్నారు. నా పిల్లికి మాసాజ్ చేయడం అంటే చాలా ఇష్టం అంటూ ఈ వీడియోకి క్యాప్షన్ అందించారు. ఇప్పటి వరకు ఈ వీడియోకు దాదాపు 3 లక్షల వ్యూస్, 17వేల లైకులు, 2వేలకు పైగా రీట్వీట్స్ వచ్చాయి.

ఇక నెటిజన్లు పలు రకాల కామెంట్లతో పిల్లిని తెగ పొగిడేస్తున్నారు. మా ఇంట్లో పిల్లి కూడా ఇలా చేస్తే బాగుండు అంటూ కొందరు కామెంట్ చేయగా, మాకు అలాంటి పిల్లే కావాలి అంటూ మరికొందరు కామెంట్లు చేశారు. మొత్తానికి ఈ నల్లపిల్లి నెట్టింట్లో మాత్రం తెగ సందడి చేస్తోంది. మీరు కూడా ఈ వీడియోపై ఓ లుక్కేయండి.

Also Read: Viral Video: ఈ చేపను వేటాడితే ఇక అంతే.. మొసలికి ఏం గతి పట్టిందో చూస్తే ఫ్యూజులు ఎగిరినట్లే!

Rakesh Jhunjhunwala: ఒక్క నెలలో రూ.832 కోట్లు ఆర్జించిన బిగ్ బుల్.. కనక వర్షం కురిపించిన రెండు షేర్లు..

Follow Us
టిప్పర్ కేబిన్‌లో చిక్కుకుని విలవిలలాడిన డ్రైవర్..!
టిప్పర్ కేబిన్‌లో చిక్కుకుని విలవిలలాడిన డ్రైవర్..!
రూ.9కే చీర.. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో తోపులాట..!
రూ.9కే చీర.. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో తోపులాట..!
కస్టమర్లకు అలర్ట్‌.. వరుసగా బ్యాంకులు బంద్‌.. ఎప్పటి నుంచి అంటే..
కస్టమర్లకు అలర్ట్‌.. వరుసగా బ్యాంకులు బంద్‌.. ఎప్పటి నుంచి అంటే..
కోసిన బంగాళాదుంపలు నల్లగా మారుతున్నాయా? తెల్లగా, తాజాగా ఉండాలంటే
కోసిన బంగాళాదుంపలు నల్లగా మారుతున్నాయా? తెల్లగా, తాజాగా ఉండాలంటే
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?