Carpenter – KTR: సూట్ కేస్ లా మడత పెట్టే వ్రత పీఠం.. కార్పెంటర్ ప్రతిభకు మంత్రి ఫిదా..
ప్రతిభ ఏ ఒక్కరి సొంతమూ కాదు. ఎలాంటి డిగ్రీలు, పట్టాలు లేకుండానే తమలోని క్రియేటివిటీతో అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఇంజనీర్లను మించిన ఐడియాలతో నూతన ఆవిష్కరణలు చేస్తున్నారు. తాజాగా ఓ కార్పెంటర్ సూట్ కేసులా మడతపెట్టే సత్యనారాయణ స్వామి వ్రత పీఠం తయారు చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఓ వ్యక్తి ట్విట్టర్ లో షేర్ చేశారు. ఈ వీడియో చూసిన తెలంగాణ మంత్రి కేటీఆర్ సైతం ఫిదా అయ్యారు.
ప్రతిభ ఏ ఒక్కరి సొంతమూ కాదు. ఎలాంటి డిగ్రీలు, పట్టాలు లేకుండానే తమలోని క్రియేటివిటీతో అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఇంజనీర్లను మించిన ఐడియాలతో నూతన ఆవిష్కరణలు చేస్తున్నారు. తాజాగా ఓ కార్పెంటర్ సూట్ కేసులా మడతపెట్టే సత్యనారాయణ స్వామి వ్రత పీఠం తయారు చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఓ వ్యక్తి ట్విట్టర్ లో షేర్ చేశారు. ఈ వీడియో చూసిన తెలంగాణ మంత్రి కేటీఆర్ సైతం ఫిదా అయ్యారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ వ్యక్తి ఓ చెక్క సూట్ కేసులాంటిది తీసుకొని వచ్చాడు. దానిని ఓపెన్ చేయగా అందులో ఒక పూజా పీఠానికి సంబంధించిన విడి భాగాలు ఉన్నాయి. వాటిని బయటకు తీసి ఒక్కొక్కటిగా వాటి స్థానాల్లో అమర్చాడు. చివరికి అది చక్కని పూజా పీఠంలా రూపుదిద్దుకుంది. ఈ విడియోఓ నెటిజన్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసి మంత్రి కేటీఆర్‌కు ట్యాగ్ చేశారు. కాగా ఈ వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇంత నైపుణ్యం ప్రదర్శించిన ఆ కార్పెంటర్ కు సాయం అందించాలని మంత్రి కేటీఆర్ ను కోరారు. దీనికి మంత్రి సానుకూలంగా స్పందించారు. సదరు కార్పెంటర్ నైపుణ్యం అద్భుతం అని కొనియాడారు. అతనికి సాయం చేసే విషయమై పరిశీలించాలని హైదరాబాద్ లోని టీ–వర్క్స్ అధికారులకు సూచించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...