Viral: ఎయిర్‌హోస్టస్ తప్పిదం వల్లే బాలికకు సెకెండ్ డిగ్రీ గాయాలయ్యాయా..?
విస్తారా ఎయిర్ లైన్స్ విమానంలో ప్రయాణిస్తున్న ఓ పదేళ్ల బాలిక ఒంటిపై హాట్ చాక్లెట్ పడి గాయాలయ్యాయని ఆ సంస్థ బుధవారం ప్రకటించింది. అయితే ఆ బాలిక చికిత్సకు సంబంధించిన ఖర్చంతా తామే తిరిగి చెల్లిస్తామని తెలిపింది. ఆగస్టు 11న ఢిల్లీ నుంచి ఫ్రాంక్‌ఫర్ట్‌కు (జర్మనీ) బయలుదేరిన యూకే25 విమానంలో ఈ ఘటన వెలుగు చూసింది. విస్తారా ఓ ప్రకటన విడుదల చేస్తూ, ‘బాలిక తల్లిదండ్రుల కోరిక మేరకు మా సిబ్బంది చిన్నారికి హాట్ చాక్లెట్ సర్వ్ చేశారు.
విస్తారా ఎయిర్ లైన్స్ విమానంలో ప్రయాణిస్తున్న ఓ పదేళ్ల బాలిక ఒంటిపై హాట్ చాక్లెట్ పడి గాయాలయ్యాయని ఆ సంస్థ బుధవారం ప్రకటించింది. అయితే ఆ బాలిక చికిత్సకు సంబంధించిన ఖర్చంతా తామే తిరిగి చెల్లిస్తామని తెలిపింది. ఢిల్లీ నుంచి ఫ్రాంక్‌ఫర్ట్‌కు (జర్మనీ) బయలుదేరిన యూకే25 విమానంలో ఈ ఘటన వెలుగు చూసింది. విస్తారా ఓ ప్రకటన విడుదల చేస్తూ, ‘బాలిక తల్లిదండ్రుల కోరిక మేరకు మా సిబ్బంది చిన్నారికి హాట్ చాక్లెట్ సర్వ్ చేశారు. ఆ సమయంలో చిన్నారి అల్లరి చేస్తుండడం వల్ల వేడివేడి హాట్ చాక్లెట్ బాలిక ఒంటిపై ప్రమాదవశాత్తూ ఒలికింది.
ఎయిర్‌లైన్స్ ప్రామాణిక పద్ధతులను అనుసరించి మా సిబ్బంది బాలిక గాయానికి ప్రాథమిక చికిత్స చేశారు. ఈ క్రమంలో, విమానంలోని పారామెడికల్ సిబ్బంది సాయం కూడా తీసుకున్నారు’’ అని తెలిపింది. విమానం ల్యాండవగానే బాలిక కోసం అంబులెన్స్ ఏర్పాటు చేసి ఆసుపత్రికి తరలించినట్టు వెల్లడించింది. అయితే, ఎయిర్‌హోస్టస్ తప్పిదం కారణంగా బాలికకు సెకెండ్ డిగ్రీ గాయమైనట్టు సోషల్ మీడియాలో ఆరోపణలు వచ్చాయి. దురదృష్టవశాత్తూ జరిగిన ఈ ఘటనలో సిబ్బంది సరిగా వ్యవహరించలేదని, కనీసం క్షమాపణలు కూడా చెప్పలేదని రచనా గుప్తా అనే మహిళ సోషల్ మీడియాలో ఆరోపించింది. అయితే, ఘటన తరువాత బాధిత కస్టమర్‌తో తమ సిబ్బంది టచ్‌లోనే ఉన్నారని ‘విస్తారా’ తన ప్రకటనలో పేర్కొంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...
పరిహారంలోనూ పక్షపాతమేనా? రాజీవ్ రహదారి బాధితుల ఆవేదన !
ఏం..పిచ్చిపిచ్చిగా ఉందా?.. ట్రంప్ ఆంక్షలపై ఇరాన్ ఫైర్! తగ్గేదే లే
ముంచుకొస్తున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వానగండం..
వందేమాతరం గీతానికి అరుదైన గౌరవం!
భారత్‌కు టైఫూన్ 'డాల్ఫిన్' దెబ్బ..మన రుతుపవనాల పై ఎఫెక్ట్!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!

