ఓ గుడిసెలో ఫోన్‌ మాట్లాడుతున్న యువకుడికి షాక్… వెనక నుంచి వచ్చిన శబ్దం విని చూసేసరికి

Updated on: Feb 27, 2025 | 9:38 PM

పాములంటే అందరికీ భయమే. పొలాలు, అటవీప్రాంతాల్లో ఎక్కువగా విషపూరితమైన పాములు సంచరిస్తూ ఉంటాయి. ఆహారం కోసం వెతుక్కునే క్రమంలో మనుషులను కాటేస్తూ ఉంటాయి. తాజాగా అలాంటి ఘటనే ఒకటి నెట్టింట వైరల్‌ అవుతోంది. ఓ విషపూరితమైన పామునుంచి ఓ వ్యక్తిని కాపాడింది అతను ధరించిన టోపీ. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

వీడియో చూసిన నెటిజన్లు షాకవుతున్నారు. అతను ఎంత అదృష్టవంతుడు.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. అడవి లాంటి ప్రదేశంలో గుడిసెలా కనిపించే రెస్టారెంట్‌లో ఒక వ్యక్తి కూర్చుని ఉన్నాడు. కర్రలతో నిర్మించిన ఆ గుడిసె గోడపై నుంచి ఓ పాము పాకుతూ వచ్చింది. అక్కడే కూర్చుని ఉన్న వ్యక్తి ఫోన్‌ మాట్లాడటంలో మునిగిపోయాడు. దానిని గమనించలేదు. అత్యంత విషపూరితమైన ఆ పాము గోడ మీద నుంచి ముందుకు వచ్చి ఆ యువకుడిని నెత్తి మీద కాటు వేయబోయింది. దాని కోరల్లో ఆ వ్యక్తి ధరించిన టోపీ చిక్కుకుంది. మరోసారి కాటు వేయడానికి ప్రయత్నించి వెనక్కి వెళ్లిన పాము నోటిలో టోపీ ఉండిపోయింది. ఈ క్రమంలో ఆ వ్యక్తి అలికిడి విని వెనక్కి తిరిగి చూసి షాకయ్యాడు. ఒక్క ఉదుటన అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కొంచెంలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఈ వీడియోను ఇప్పటికే 7 లక్షల మందికి పైగా వీక్షించారు. వేలాది మంది లైక్‌ చేస్తూ రకరకాల కామెంట్లు చేశారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బస్సులో మాటలు కలిపిన ముగ్గురు మహిళలు.. బ్యాగ్‌ను చూసి షాక్‌

మీటర్ ట్యాంపరింగ్‌ పెట్రోల్ బంకులో రూ. కోట్లు కొల్లగొట్టారు

లిఫ్టులోకి కుక్కను తీసుకురావద్దనందుకు..బాలుడిని తీవ్రంగా కొట్టిన మహిళ

అదృశ్యమైన జ్యోతిష్యుడు అస్థిపంజరమయ్యాడు.. పోలీసుల దర్యాప్తులో షాకింగ్‌ సీన్స్‌

పిల్లలు చనిపోతుంటే ఫోటో షూట్‌ చేస్తారా.. జెలెన్‌స్కీ మీద మస్క్‌ మండిపాటు