Viral Video: మౌంటెన్ ల‌య‌న్ ను త‌న పంజాతో బెంబేలెత్తించిన అడవి పిల్లి… షాకింగ్ వీడియో

|

May 08, 2021 | 3:21 PM

ధైర్యం ఉంటే చాలు అసాధ్యాల‌ను కూడా సుసాధ్యం చేయ‌వ‌చ్చు. మ‌న‌షులే కాదు జంతువులు, ప‌క్షులు.. ఇలా జీవులు అన్నింటి విష‌యంలో ఈ విష‌యం...

Viral Video:  మౌంటెన్ ల‌య‌న్ ను త‌న పంజాతో బెంబేలెత్తించిన అడవి పిల్లి... షాకింగ్ వీడియో
Canadian Lynx Vs Mountain L
Follow us on

ధైర్యం ఉంటే చాలు అసాధ్యాల‌ను కూడా సుసాధ్యం చేయ‌వ‌చ్చు. మ‌న‌షులే కాదు జంతువులు, ప‌క్షులు.. ఇలా జీవులు అన్నింటి విష‌యంలో ఈ విష‌యం చాలాసార్లు నిరూపిత‌మైంది. అడవి జంతువులకు సంబంధించిన చాలా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫ‌న్నీగా ఉంటే.. మ‌రికొన్ని వేటాటే విజువ‌ల్స్ గ‌గుర్పాటుకు గురిచేస్తాయి. మరికొన్ని ధైర్యాన్ని నూరిపోస్తాయి. తాజాగా అలాంటి వీడియో ఒక‌టి సోష‌ల్ మీడియాలో తెగ చ‌క్క‌ర్లు కొడుతుంది. అడ‌వికి రాజు అయిన సింహం అత్యంత శ‌క్తివంత‌మైన జంతువు అన్న విష‌యం తెలిసిందే. దాని ముందు ఏ జంతువు అయినా తోక ముడ‌వాల్సిందే. ఈ కారణంగానే బలమైన మనిషిని సింహంతో, పిరికివారిని పిల్లితో పోల్చుతారు. కానీ పిల్లి.. సింహానికి బ్యాంగ్ ఇవ్వడం మీరు చూశారా!. ఇప్పుడు మీ ముందుకు అలాంటి వీడియోనే తీసుకొచ్చాం.

వీడియోలో, ప‌ర్వ‌త‌ సింహం ఒక అడవి పిల్లిపై దాడి చేయ‌డం మీరు చూడవచ్చు. కాని చాలా ధైర్యంతో అడ‌వి పిల్లి పర్వత సింహంతో పోరాడుతుంది. దాని పంజాలతో సింహాన్ని సమానంగా ఎదుర్కుంటుంది. దీంతో మౌంటెన్ ల‌య‌న్ అక్క‌డ్నుంచి స్లోగా వెళ్లిపోతుంది. ఈ వీడియోను జంగ్లీక్స్ప్లోరీ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేశారు. అడవి పిల్లి, పర్వత సింహం మధ్య ప్రమాదకరమైన యుద్ధం అని క్యాప్ష‌న్ పెట్టారు. ఈ వీడియోను నెటిజ‌న్లు చాలా ఇష్టపడుతున్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో షేర్ చేస్తున్నారు.

Also Read: పెద్దపల్లి జిల్లా పరిషత్ ఛైర్మన్ పుట్టా మధు అరెస్ట్.. భీమ‌వ‌రంలోని ఓ హోటల్‌లో ఉండ‌గా

పెద్దపల్లి జిల్లా పరిషత్ ఛైర్మన్ పుట్టా మధు అరెస్ట్.. భీమ‌వ‌రంలోని ఓ హోటల్‌లో ఉండ‌గా