నీటి కొలను చూసి సరదాపడిన కుందేలు.. ఏం చేసిందో చూడండి..
కుందేళ్ళు నేల మీద నివసించే జంతువులు. ఎడారులలో నైనా, ఉష్ణమండల అరణ్యాలలోనైనా, చిత్తడి నేలలోనైనా జీవిస్తాయి. ఇవి కుందేళ్ళు పూర్తిగా శాకాహారులు.
కుందేళ్ళు నేల మీద నివసించే జంతువులు. ఎడారులలో నైనా, ఉష్ణమండల అరణ్యాలలోనైనా, చిత్తడి నేలలోనైనా జీవిస్తాయి. ఇవి కుందేళ్ళు పూర్తిగా శాకాహారులు. ఎక్కువగా గడ్డిని, కాయగింజలనూ ఆహారంగా తీసుకుంటాయి. ఇప్పడీ కుందేలు ఉపోద్ఘాతం ఎందుకు చెబుతున్నారు అనుకుంటున్నారా… ఓ కుందేలుకు సంబంధించిన చక్కని వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. అటవీ ప్రాంతంలో అదురుతూ బెదురుతూ ఎంతో చలాకీగా తిరిగే కుందేలు కొలనులో దిగి ఈత కొట్టింది. ఈ వీడియో ఇప్పుడు నెటిజన్లకు ఈత నేర్పిస్తుంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక కుందేలు ఓ కొలను దగ్గరకి వచ్చింది. కాసేపు అటూ ఇటూ గమనించింది. సరదాగా ఈతకొట్టాలనిపించినట్లుంది. మెల్లగా ఆ కొలనులోకి దిగింది. ఈ గట్టునుంచి ఆ గట్టుకి ఈత కొట్టుకుంటూ ఓ రౌండేసి చకచకా వచ్చేసింది. ఈ వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటుంది. కుందేలు ఈతకొట్టడం చూసి కొందరు ఆశ్చర్యపోతున్నారు. పరుగు పందెలోనే కాదు.. స్విమ్మింగ్‌లోనూ విన్నరే.. అంటూ కామెంట్ చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఒకే వ్యక్తిని ఓకే పాము ఐదు సార్లు కాటేసింది.. ఆ ప్లేస్ లో మాత్రమే..
మరణించిన యజమాని కోసం శ్మశానానికి పరుగెత్తిన ఆవు !!
తుపాకి చేతపట్టి పిల్లలను స్కూలుకు తీసుకెళ్తున్న తండ్రి !! కారణం తెలిస్తే షాకే..
కొరివితో తల గోక్కోవడం అంటే ఇదే.. పడగవిప్పిన 3 నాగులతో పరాచకాలు.. ఇచ్చిపడేశాయ్‌గా
53 సార్లు పెళ్లాడిన వ్యక్తి.. మనశ్శాంతి కోసమే తప్ప మరొకటి కాదట..