ఒకే వ్యక్తిని ఓకే పాము ఐదు సార్లు కాటేసింది.. ఆ ప్లేస్ లో మాత్రమే..

పాములు పగబడతాయని.. సప్తసముద్రాల ఆవల ఉన్నా వచ్చి పగ తీర్చుకుంటాయని కథలు కథలుగా చెప్పుకుంటారు. కానీ పాములు నిజంగా పగ బడతాయా అనే విషయంపై చాలా మందిలో అనుమానాలు ఉన్నాయి.

Phani CH

|

Sep 23, 2022 | 9:19 AM

పాములు పగబడతాయని.. సప్తసముద్రాల ఆవల ఉన్నా వచ్చి పగ తీర్చుకుంటాయని కథలు కథలుగా చెప్పుకుంటారు. కానీ పాములు నిజంగా పగ బడతాయా అనే విషయంపై చాలా మందిలో అనుమానాలు ఉన్నాయి. కచ్చితంగా పగబడతాయని కొందరు వాదిస్తే.. అలాంటిదేమీ లేదని, మిగతా జంతువుల మాదిరిగా పాములు సాధారణమైనవని చెబుతుంటారు. పాముల పగ సంగతి పక్కన పెడితే… ఓ పాము ఓ వ్యక్తిని ఏకంగా ఐదుసార్లు ఒకే ప్లేస్‌లో కాటు వేసిందంటే మీరు నమ్ముతారా.. నిజం ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. ఉత్తర ప్రదేశ్ లో ఒకే వ్యక్తిని, ఒకే పాము, ఒకే ప్లేస్‌లో కేవలం 9 రోజుల వ్యవధిలోనే ఐదు సార్లు కాటేసింది. ఆగ్రా జిల్లా మన్​కేఢా గ్రామంలో రజత్ చాహర్ డిగ్రీ చదువుతున్నాడు. సెప్టెంబర్‌ 6న రాత్రి సమయంలో ఇంటి బయట అతని ఎడమ కాలిపై పాము కాటేసింది. దీంతో రజత్ భయంతో గట్టిగా కేకలు వేశాడు. వెంటనే అలర్ట్ అయిన కుటుంబసభ్యులు వచ్చి చూసేసరికి అతను బాధలో విలవిల్లాడుతూ కనిపించాడు. పాము కోసం వెతకగా కనిపించలేదు. బాధితుడిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించకుండా నాటు వైద్యుడి దగ్గరకు తీసుకెళ్లారు. పరిస్థితి సీరియస్‌ కావడంతో ఎస్ఎన్​మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చేర్చారు. రజత్ ను పరీక్షించిన వైద్యులు పాముకాటు లక్షణాలేమీ లేవని చెప్పి ఇంటికి పంపించారు. 8 వ తేదీన వాష్ రూమ్ కు వెళ్లిన రజత్ ఎడమ కాలిపై అదే పాము మరోసారి కాటేసింది. హుటాహుటిన రజత్ కు నాటు వైద్యుల దగ్గర చికిత్స చేయించారు. సెప్టెంబర్‌ 11న ఇంట్లో మూడోసారి, 13న బాత్రూమ్​లో నాలుగోసారి, 14న చెప్పులు వేసుకుంటుండగా ఐదో సారి రజత్​ను పాము కరిచింది. అది కూడా ఎడమ కాలిపై మాత్రమే. పాము కరిచిన ప్రతిసారీ కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్తున్నారు. కానీ వైద్యులు మాత్రం పాముకరిచిన లక్షణాలేవి లేవని చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. విషయం తెలుసుకున్న గ్రామస్థుల్లో ఊహాగానాలు మొదలయ్యాయి. ఒక వ్యక్తినే పాము ఐదు సార్లు ఎలా కాటేస్తుందనే విషయం తెలుసుకునేందుకు రజత్ ఇంటికి వెళ్లి పరామర్శిస్తున్నారు. ఏది ఏమైనా ఒకే పాము, ఒకే వ్యక్తిని, ఒకే చోట ఐదు సార్లు కాట్లు వేయడం విచిత్రంగానే అనిపిస్తుంది కదూ..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మరణించిన యజమాని కోసం శ్మశానానికి పరుగెత్తిన ఆవు !!

తుపాకి చేతపట్టి పిల్లలను స్కూలుకు తీసుకెళ్తున్న తండ్రి !! కారణం తెలిస్తే షాకే..

కొరివితో తల గోక్కోవడం అంటే ఇదే.. పడగవిప్పిన 3 నాగులతో పరాచకాలు.. ఇచ్చిపడేశాయ్‌గా

53 సార్లు పెళ్లాడిన వ్యక్తి.. మనశ్శాంతి కోసమే తప్ప మరొకటి కాదట..

డెలివరీ బాయ్ సాహసానికి వావ్ అనాల్సిందే.. ఏకంగా ట్రైన్‌నే చేజ్ !!

 

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu