Camel in Restaurant: రెస్టారెంట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఒంటె.. ! విస్తుపోయిన సిబ్బంది ఎం చేసారంటే..(వీడియో)

Updated on: Oct 18, 2022 | 9:26 AM

అమెరికాలోని లాస్ వెగాస్‌లో ఇన్ అండ్ అవుట్ రెస్టారెంట్‌లోకి ఓ వ్య‌క్తి ఏకంగా త‌న ఒంటెతో న‌డుచుకుంటూ వ‌చ్చి ఆర్డ‌ర్ తీసుకువెళుతున్న వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.


అమెరికాలోని లాస్ వెగాస్‌లో ఇన్ అండ్ అవుట్ రెస్టారెంట్‌లోకి ఓ వ్య‌క్తి ఏకంగా త‌న ఒంటెతో న‌డుచుకుంటూ వ‌చ్చి ఆర్డ‌ర్ తీసుకువెళుతున్న వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. వ్య‌క్తి వెంట భారీ జంతువు రెస్టారెంట్‌లోకి రావ‌డం చూసి అక్క‌డున్న వారితో పాటు రెస్టారెంట్ సిబ్బంది విస్తుపోయారు.12 ఏళ్ల వ‌య‌సున్న ఫెర్గీకి ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే ఇష్ట‌మ‌ని వీడియోకు క్యాప్ష‌న్‌గా ఇచ్చారు. సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారిన ఈ వీడియోపై నెటిజ‌న్లు త‌లోర‌కంగా స్పందిస్తున్నారు. లాస్ వెగాస్‌లో ఏదైనా సాధ్య‌మేన‌ని ఓ వ్య‌క్తి కామెంట్ చేయ‌గా ఇది జీవ హింస కింద‌కు వ‌స్తుంద‌ని మ‌రో నెటిజ‌న్ కామెంట్ చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Army Dog: ఆర్మీ డాగా మజాకా..! రెండు బుల్లెట్లు దిగినా వెనుకడుగు వేయని ఆర్మీ డాగ్.. ఇద్దరు ముష్కరులు హతం.

woman death: “సమాధిలోకి వెళుతున్నా..చనిపోబోతున్నా..” అంటూ బామ్మ కలకలం..వీడియో

Woman paraded: దొంగ అరాచకం.. మహిళను వీధుల్లో నగ్నంగా తిప్పాడు.. నెట్టింట హల్ చల్ చేస్తున్న వీడియో.

Published on: Oct 18, 2022 09:26 AM